Friday, 1 November 2024

మూడో తరం

 ఇది నా స్వీయ రచన 

మూడో  తరం


సుదర్శనం వాళ్ళింట్లో విదేశంలో స్థిరపడ్డ మొదటి వాడు. అమెరికా లో పేరు,డబ్బు రెండూ బాగా సంపాదించేడు. అతని భార్య భానుమతి తప్పనిసరై భర్త

తో అమెరికా లో ఉండేది. 

భానుమతి  తన కొడుకు గోపీచంద్ ని బాగా పెంచింది కానీ

అతను అమెరికన్ అమ్మాయిని పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడి పోయాడు.

భానుమతి మనవడికి సంవత్సరం నిండేక ఇండియా కి తీసుకుని వచ్చింది. గోపీచంద్ తల్లికి డబ్బు పంపేవాడు. 

గోపీచంద్  కొడుకు మనీష్.నానమ్మ  పెంపకం లో మనీష్ పెరిగాడు. భానుమతి   చదువుతో పాటు క్రమశిక్షణ బాగా నేర్పింది. మనీష్ కి మంచి కంపెనీలో మంచి పొజిషన్ లో పని 

చేస్తున్నాడు. 

మనీష్ కి భానుమతి తనకి, తన మనవడికి బాగా నచ్చిన అమ్మాయి తో పెళ్లి చేసింది. పెళ్లి కి

గోపిచంద్,అతని భార్య వచ్చి చూసి వెళ్ళేరు. 

మనీష్,బృంద ల పెళ్లి అయిన సంవత్సరం లోగానే మనీష్ అమెరికా వెళ్ళాల్సివచ్చింది. 

బృంద కి ఇంగ్లీష్ ఎక్కువగా రాదు.

ఇంగ్లీషు  మాట్లాడటం అసలే రాదు. అయినా మనీష్ తనతో పాటు తన భార్యని అమెరికా తీసుకెళ్ళేడు. సెలవు రోజుల్లో అన్ని చోట్లకీ తీసుకుని వెళ్ళేవాడు. 

బృంద ఇంగ్లీషు రాక, అర్థమవక ఇబ్బంది పడేది. ఇంగ్లీషు సినిమాలు చూసి ఇంగ్లీషు నేర్చుకోవడానికి ప్రయత్నించేది. తప్పు మాటాడితే స్నేహితులు నవ్వేసేవారు. సంవత్సరం లో బృందకి అన్నీ బాగా అలవాటయిపోయాయి.

బృంద తల్లి కాబోతోందని తెలిసి 

 వచ్చి కొన్నాళ్ళు వాళ్ల తో ఉంది. బాబు మొదటి పుట్టినరోజు ఇండియాలోనే జరిపేరు.

మనీష్  నానమ్మతో, బృందతో ,బాబుతో ఇండియా వచ్చి స్థిరపడ్డాడు.

No comments:

Post a Comment