Friday, 1 November 2024

దేవుడికి చేసినట్టు

 దేవుడికి  చేసినట్టు 

కొడుకుకి  చేయించి పెడుతుంది 

ఒకప్పుడు  అందరికీ 

తనే చేసిపేట్టేది


డైపర్లు లేని కాలంలో 

తనే పీతిగుడ్డలుతికేది


అత్తమామలకి

ఆడపడుచులకి

మరుదులకి

వండివార్చేది


అతిధులకు 

అన్నపూర్ణ  ఆమె

మోకాళ్ళు అరిగి

మంచమెక్కింది

No comments:

Post a Comment