ఇది నా స్వీయ రచన
జున్ను
ఆ పాప జున్ను ముక్కే.
అందుకే వాళ్ల తాత జున్నూ
అని పిలుస్తాడు.
పుట్టగానే తనని చూసుకోవడానికి
అమ్మమ్మని అమెరికా పిలిపించుకుంది.
అమ్మమ్మకి ఆరు నెలలు మంచి కాలక్షేపం.
ఆరు నెలల తరువాత జున్ను దగ్గరకి వెళ్తే ఆ పాప నేర్చుకున్న తొలి పదం అమ్మమ్మ. అమ్మని కూడా "అమ్మ అమ్మ "అని రెండు సార్లు పిలిచేది.
తాత ఎంత సేపు ఆడించినా " అమ్మమ్మ అమ్మమ్మ " అని వెతుక్కుంటూనే ఉండేది.
ఏడాది వచ్చేసిందని అమ్మమ్మకి నడిపించేద్దామన్న తాపత్రయం. రెండో రోజుకే నడక నేర్చింది జున్ను.
సోఫా మీద మడగాళ్ళేసి కూర్చుని
శివతాండవం పాట వింటే అలా కూర్చునే పైకి లేస్తూ ,ముందు ముందుకి వస్తూ మంచి ఊపుతో నాట్యం చేసేది జున్ను
ఇప్పుడు అమ్మమ్మ "చిగురాకుల ఊయలలో " అని పాడితే విని ఆ పాట పల్లవి నేర్చేసుకుంది.
కానీ ఎవరైనా నువ్వు ఇండియన్ వా, అమెరికన్ వా అని అడిగితే అమెరికన్ అని చెప్తుంది. అమెరికాలో ఉన్నందుకు అదే సరైన సమాధానం అనుకుంటుందేమో.
No comments:
Post a Comment