Friday, 1 November 2024

బాధ్యత

 ఇది నా  స్వీయ రచనలు


బాధ్యత 


సుందరరావు,  రామ్మోహన్, శ్రవణ్ ముగ్గురూ అన్నదమ్ములు. తండ్రి  నరహరి  ఇటీవలే మరణించారు. తల్లి  ఉమాదేవికి ఆరోగ్యం అంతంతమాత్రం. 

పెద్ద వాళ్లిద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయి కానీ శ్రవణ్ కి ఇంకా పెళ్ళి కాలేదు. పక్క ఊళ్ళో  చిన్న  ఉద్యోగం. అతను  అక్కడే ఉంటాడు. పెద్ద వాళ్లిద్దరూ ఒకే ఊళ్ళో  ఉంటారు కాని వేరువేరుగా ఉంటారు. 

పెద్ద వాళ్లిద్దరివీ మంచి ఉద్యోగాలే.సొంత ఇళ్ళు  ఉన్నాయి కూడా. 


ఇప్పుడు అత్తగారిని ఎవరు తీసుకుని వెళ్లాలి అన్న చర్చ కోడళ్ళిద్దరి మధ్య కొనసాగుతోంది. 

పెద్ద కోడలు మీనాక్షి  పిల్లలిద్దరికీ  పరీక్షలున్నాయి కాబట్టి ఇప్పట్లో తీసుకు వెళ్ళడం కుదరదని‌ తేల్చి చెప్పింది. 


రెండో కోడలు రత్నం తన తల్లి  వచ్చి తన దగ్గర  కొన్నాళ్ళు ఉంటుంది  కాబట్టి తను కూడా  తీసుకెళ్ళలేనని చెప్పింది. 

పెద్ద కొడుకులిద్దరూ ఈ చర్చలో పాల్గొనకుండా  పేపర్  పఠనంలో మునిగి పోయారు. 


శ్రవణ్  వదినలతో " అమ్మ ని నేను తీసుకుని వెళ్తాను. అమ్మ నా దగ్గర ఉంటుంది. అమ్మ  పేర ఆరోగ్య భీమా చేయిస్తాను. రేపే మేము ఇద్దరం బయలుదేరతాం" అన్నాడు. 

అన్నీ వింటున్న ఉమాదేవికి చిన్న కొడుకు తన బాధ్యత తీసుకున్నందుకు సంతోషించాలో, పెద్ద వాళ్లిద్దరూ ఏమీ పట్టనట్టు ఉన్నందుకు బాధపడాలో  అర్థం కాలేదు.

No comments:

Post a Comment