ఇది నా స్వీయ రచన
విద్వాన్ సర్వత్ర. .....
ప్రదీప్ బాల నటుడిగా అవతారమెత్తిన రోజు వాళ్ళ అమ్మ ఆనందానికి పట్టపగ్గాలు లేవు. ఎప్పుడూ కొడుకుతో ఉండేది. నిర్మాతలతో, దర్శకులతో, హీరోలతో మాట్లాడుతూ హడావుడిగా ఉండేది.
బాలనటుడిగా బాగానే గడిచింది ప్రదీప్ కి.
తర్వాత నటనలో శిక్షణ తీసుకున్నాడు.
వాళ్ళ అమ్మకి కొడుకుని ఒక పెద్ద నటుడిగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని కోరిక. అప్పటిదాకా కూడబెట్టిన డబ్బు ఖర్చు పెట్టి ఓ పేరు మోసిన దర్శకుని ఒప్పించి అతను తన కొడుకుని హీరోగా పరిచయం చేసేలా చేసింది. ఆ సినిమా విడుదల అయింది కూడా. కానీ అదే రోజు విడుదల అయిన మరో సినిమా కి మంచి టాక్ రావడం తో ప్రదీప్ సినిమా ఆడలేదు.
హీరోగా ప్రదీప్ రెండో సినిమాకి కూడా ఎక్కువ రోజులు ఆడలేదు.
ప్రదీప్ మూడో సినిమాకి తొందర పడలేదు.
ప్రదీప్ కి వాళ్ళ తెలుగు మాస్టారు చెప్పింది గుర్తొచ్చింది " స్వదేశే పూజ్యతే రాజా, విద్వాన్ సర్వత్ర పూజ్యతే "
ప్రదీప్ తను ఆపేసిన చదువు మళ్ళీ మొదలెట్టాడు.
No comments:
Post a Comment