Friday, 1 November 2024

మనిషి విలువ

 ఇది నా స్వీయ  రచన


మనిషి విలువ 


అకస్మాత్తుగా  సుజాత కి ఈశ్వరి

గుర్తొచ్చారు.


సుజాత ఆవిడ ప్రిన్సిపాల్ గా పనిచేసిన చోట తను కూడా టీచర్ గా పనిచేసింది. ఆవిడ తనకన్నా ఉన్నతాధికారి అన్న భావనతో సుజాత ఎప్పుడూ ఉండేది.

అది ఆశ్రమ పాఠశాల కావడం తో, అందులోకీ ఆడపిల్లల పాఠశాల కావడం వల్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సివచ్చేది. అకస్మాత్తుగా  ఎవరికైనా ఆరోగ్యం క్షీణిస్తే, దగ్గరలో ఉన్న పట్టణానికి రాత్రికి రాత్రే తీసుకుని వెళ్లవలసివచ్చేది.

అలా వాళ్లని ఆవిడ అటువైపు వెళ్ళే లారీల మీద కూడా, మరో టీచర్ సాయంతో తీసుకుని వెళ్ళిపోయేవారు. అలా గ్రామీణ ప్రాంతాలలో ఉండే విద్యాలయాలకి వాళ్ల సొంత వాహనం ఉండాల్సిందే. 

బడిలో  చేరిన ఏడాదికే డెలివరీ కోసం  సుజాత  మూడు నెలల సెలవులో వెళ్ళింది. సుజాత బడి ఆవరణలో కట్టించిన క్వార్టర్స్ లో  ఉండేది. సుజాత  బడిలో పాపతో అడుగుపెట్టగానే పిల్లలు  చూసి  తోసుకుంటూ పరిగెత్తుకొచ్చేరు.


ఆ సందడి లో వాళ్ళు రెండు పూల

కుండీలు కూడా పగలకొట్టేసారు. ఆరోజు అసెంబ్లీలో ఈశ్వరి  విద్యార్ధినులకి "మీకు  టీచర్ అంటే ప్రేమ ఉన్నా ఎప్పుడూ క్రమశిక్షణ పాటించడం ముఖ్యం" అని చెప్పేరు.

ఆ బడిలో  ఇంగ్లీషు బోధించే ఉపాధ్యాయిని మరో అవకాశం రావడంతో రాజీనామా చేసి వెళ్ళిపోయింది. ఈశ్వరి సుజాతని పిలిపించి "పదో తరగతి పిల్లలు ఇబ్బంది పడకూడదు ,మీరు ఆ తరగతికి ఇంగ్లీషు బోధించాలి. మీరు ఇంగ్లీషు బోధనలో కూడా 

శిక్షణ తీసుకున్నారు కదా. ఈ రోజు నుండి ఆ క్లాస్ కి వెళ్ళండి " అని చెప్పేసారు. సుజాతకి ఏ పని అప్పచెపితే అది చేసుకు పోవడమే అలవాటు. 


ఈశ్వరి బదిలీ అయి వెళ్ళిపోయాక సుజాతకి బడి ఏం నష్టపోయిందో తెలిసింది. మళ్ళీ బడికి మంచి రోజులు ఎప్పుడు వచ్చేయో తెలియడానికి సుజాత అక్కడ లేదు. ఆమె కూడా ఆ బడి విడిచి వెళ్లిపోయింది.

No comments:

Post a Comment