ఇది నా స్వీయ రచన
భాగోతం
ఓ రచయిత్రి పొద్దున్నే ఓ టీ తాగి రాయడం మొదలెట్టేవారట. నేను రాస్తూ ఉంటాను కానీ గొప్ప రచయిత్రిని కానులెండి.
ఓ డాక్టరు "రాత్రిపూట లేచినా టైం
చూస్తూ ఉండకండి " అని చెప్పేరు. కాని ఏదో ఒక టైం లో పక్కన ఉన్న సెల్ లో టైమ్ చూస్తుంటా.
మా పెళ్లయిన కొత్తలో నేను కాఫీ తాగేదాన్ని కాదు. ఏదయినా హోటల్ కి వెళ్తే మావారు " నాకు కాఫీ, మా ఆవిడకి బోర్నవిటా "అని ఆర్డర్ చేసేవారు హాస్యం గా.
అలా అలా, నాకూ కాఫీ అలవాటయిపోయింది. కానీ, ఇప్పటికీ నేను ఒక్కదాన్ని ఉంటే
కాఫీ పెట్టుకోను.
ఒకొక్కప్పుడు చాలా వేగం తెలివొచ్చి మా చిట్టి చెప్పినట్టు " దొళ్ళి దొళ్ళి దొళ్ళి దొళ్ళి "దొర్లుతునే ఉంటా. అలాటప్పుడు రోజూ పొద్దుట తాగే కాఫీ కొంచెం వేగం తాగితే బాగున్ననుకుంటా.
కాఫీ సెక్షన్ మావారిది.
నేను కాఫీ తాగుదామనను. " నేను చాలా సేపయి మేలుకునే ఉన్నాను కదా. కాఫీ ఇవ్వొచ్చు కదా అనుకుంటుంటా.
సరేలెండి. ఈ కాఫీ భాగోతం ఎప్పుడూ ఉండేదేలెండి.
No comments:
Post a Comment