Friday, 1 November 2024

ఆరాధ్య

 ఇది నా  స్వీయ రచన 


ఆరాధ్య 


ఆరాధ్య అందానికే‌ అందం.ఆమె‌ అందానికి అందరూ ఫిదా అయిపోయారు. ఆమె‌ అందానికి 

ఎందరెందరో అభిమానులు. 

ఆరాధ్యకి చదువు మీద  శ్రద్ధ లేదు. ఇంటి పని అసలే చేయదు.తమ్ముడి గురించి పట్టించుకోదు. 

ఆరాధ్య అందానికి అవకాశాలు బాగా వచ్చాయి. డబ్బు కూడా వచ్చి పడింది. జీవితాన్ని  బాగా అనుభవించింది. తనకి నచ్చిన

పద్ధతి లో జీవించింది.

ఆమె నడత, పద్ధతి  తల్లితండ్రులకి ,తమ్ముడికి నచ్చక  ఆరాధ్యని బాగా దూరం పెట్టేరు. అయినా ఆరాధ్య పట్టించుకోలేదు. 

రోజులు గడిచాయి. తనతో గడిపేవాళ్ళ సంఖ్య తగ్గింది. అవకాశాలూ తగ్గేయి. జీవితంలో సందడి తగ్గింది. ఒంటరితనం  పెరిగింది. 

ఆరాధ్య తల్లితండ్రులు కాశీకి వెళ్తున్నట్టు  ఆరాధ్యకి తెలిసింది. అక్కడ తల్లితండ్రులు  తొమ్మిది రోజులుంటారు.ఆరాధ్య వాళ్ళతో  

కలిసి గడపాలనుకుంటుంది. తన చిన్నాన్న తో ఫోన్ లో మాట్లాడి తల్లితండ్రులని ఒప్పించమంది.ఆరాధ్య చిన్నాన్న అడిగితే వాళ్లిద్దరూ కాదనలేకపోయారు.

ఆరాధ్య వారితో కలిసి  కాశీకి ప్రయాణమయింది. చాలా  నిరాడంబరంగా తయారైయ్యేది.తొమ్మిది రోజులూ గంగాస్నానం చేసింది. ఆఖరి రోజు "మీరు రూమ్ కి వెళ్ళండి. నేను స్నానం చేసి వస్తాను" అంది.

అలా చెప్పి గంగాస్నానం చేసి తిరిగి తల్లితండ్రుల దగ్గరికి మరి వెళ్ళనే లేదు. ఆరాధ్య తల్లితండ్రులకి ఆమె  గంగలో మునకలు వేసి కావాలనే వెనక్కి రాలేదని అర్ధమైంది. 

  ఆరాధ్య గంగాస్నానం తరువాత 

వెనక్కి  తిరిగి రాలేదని  తల్లితండ్రులు  కీడు శంకించారు.

"అక్కడ ఎవరో మునిగిపోయారుట" అంటే ఆ మాట నమ్మేరు.


ఆరాధ్య  మునిగి పోవాల్సిందే. సుదర్శన్  ఆమెని కాపాడాడు. 

ఆరాధ్య నీరసంగా ఉందని  ఆసుపత్రి లో చేర్చేడు. ఆరాధ్యని తనతో ఢిల్లీ కి తీసుకెళ్ళి తన  స్నేహితురాలి దగ్గరకి తీసుకెళ్ళాడు. ఆమె  ఒక డాక్టరు. ఆరాధ్య తల్లి కాబోతోందని అతనికి చెప్పింది. 

  సుదర్శన్ ఆరాధ్యని ఏమీ ప్రశ్నించలేదు. ఆరాధ్యని తన స్నేహితురాలి దగ్గర  ఉంచి అప్పుడప్పుడు  వెళ్లి చూసేవాడు. 


సుదర్శన్ స్నేహితురాలు సుమ  ఆరాధ్య ని తన ఇంటి దగ్గరే ఉంచి జాగ్రత్తగా చూసుకునేది. ఆరాధ్య  ఒక ఆడపిల్లని ప్రసవించింది.


ప్రసవానికి ముందు  సుమ ఆరాధ్య తల్లితండ్రులు ఎక్కడో

 ఉంటున్నారో తెలుసుకుంది. పాప

పుట్టేక సుదర్శన్ హైదరాబాద్ వెళ్ళి ఆరాధ్య తల్లితండ్రులను ఢిల్లీ తీసుకుని వచ్చాడు. 

ఆరాధ్య తల్లితండ్రులు  ఆమెని చూసి చాలా  సంతోషించారు. 

ఆరాధ్య  ఆడపిల్లని  ప్రసవించింది.సుదర్శన్ ఆరాధ్య తల్లి తండ్రులని తన స్నేహితుడు ఇల్లు  ఖాళీ ఉంటే  అక్కడ  ఉండమన్నాడు. ప్రసవమయ్యాక

సుదర్శన్ ఆరాధ్యని ఆ ఇంటికే తీసుకొచ్చాడు. 

ఆరాధ్యని ఆమె తల్లితండ్రుల దగ్గరికి తీసుకెళ్ళేముందు ఆమె ని ఏమీ అనకుండా జాగ్రత్తగా చూసుకోమన్నాడు. 


ఆరాధ్య కూతురిని 

 గంగా అని పిలిచేవాడు. వృత్తి పరంగా సుదర్శన్ డాక్టరు. పనిమీద బెనారస్ హిందూ యూనివర్సిటీ కి వెళ్ళి ,అక్కడి నుండిగంగ ఒడ్డుకి వెళ్ళి, అక్కడ మునిగిపోతున్న ఆరాధ్యని కాపాడాడు సుదర్శన్. 

సుదర్శన్ పెట్టిన పేరుతోనే‌ అందరూ పాపని గంగా  అని పిలిచేవారు. గంగ కి మూడో నెల వచ్చాక ఆరాధ్య తల్లితండ్రులు తమ కొడుకు  దగ్గరకి  వెళ్ళిపోయారు.

ఆరాధ్య సర్టిఫికెట్లు వాళ్ల ఊరి నుండి తెప్పించి సుదర్శన్ ఆమెని నర్స్ శిక్షణ లో చేర్పించాడు. ఆ సమయంలో  గంగ సుదర్శన్ ఇంట్లో  ఉండేది. ఇంట్లో  పనివాళ్ళు, సుదర్శన్ తల్లి గంగని చూసుకునేవారు.

గంగ  సుదర్శన్ ఆసుపత్రి లోనే నర్సుగా పనిచేసేది. సుదర్శన్ తల్లి  అనారోగ్యం  పాలయితే ఆమెకి దగ్గరుండి అన్ని సేవలు చేసేది. 


ఆ రోజు సుదర్శన్ తల్లి  ఆరాధ్య తో"నా కొడుకు  నిన్ను ఇష్టపడుతున్నాడు. నాకూ నిన్ను  నా కోడల్ని చేసుకోవాలని ఉంది. నీ అభిప్రాయం  నువ్వే వాడితో చెప్పు "అంది. 

సుదర్శన్ తన గదిలో చదువుకుంటున్నాడు.ఆరాధ్య  సుదర్శన్ తో " మీరు  నన్ను ఇష్టపడుతున్నారట. కానీ మీకు నాగురించి ఏమీ తెలియదు ""అంది.

సుదర్శన్ ఆరాధ్య తో" నాకు నీ గురించి ఏమీ తెలియక్కరలేదు.

నేనంటే నీకు ఇష్టమో కాదో ‌నాకు తెలిస్తే చాలు "అన్నాడు. 

ఆరాధ్య  సుదర్శన్ తో" మీరు గంగ కి తండ్రినవుతానంటే అంత కంటే నాకు  కావలసినదేముంది" అని కన్నీరు ఉబికి వస్తుంటే అక్కడి నుంచి వెళ్ళిపోయింది

No comments:

Post a Comment