ఇది నా స్వీయ రచన
అశాశ్వతం
ఇది ఆడాళ్ళ విషయం అంటే మగవాళ్ళు కూడా ఆసక్తి గా వింటారేమో.
ఆడవాళ్ళు చాలా కళా పిపాసకులు. ఏ కొత్త చీరో, కొత్త డిజైనో కనిపిస్తే ఆగి మరీ చూస్తారు. అలాగే కొత్త నగ. ఇప్పుడు వరలక్ష్మి పూజకి కూడా
అమ్మవారిని చక్కగా అలంకరిస్తున్నారు.
నాకో బలహీనత ఉంది. ఎవరి జడ అయినా బావుంటే వాళ్లు కనిపించినంత వరకు చూస్తూనే ఉంటా.
నేను ఒక బడిలో పంతులమ్మ గా చేరా. కొన్నాళ్ళు ఒక రూమ్ లో మరో ఇద్దరితో కలిసి ఉన్నా. ఒక రోజు గడిచింది.
మర్నాడు జడ వేసుకుందామని జడవిప్పా. అప్పుడు వాళ్లిద్దరూ చెప్పారు.ముందురోజు ఇద్దరూ బెట్ కట్టుకున్నారుట.
ఒకామె నాది కొంత వంకీల జుత్తు కాబట్టి పొడుగ్గా ఉండే అవకాశమే లేదు,సవరం లాటి ఏర్పాటు చేసుకున్నానని. మరొకామె అదేం కాదు సహజమేనని. ఆడవాళ్ళకి అందం విషయంలో ఎంత ఆసక్తి ఉంటుందో నాకు బాగా తెలిసింది.
ఒకరోజు నేను నా ద్విచక్ర వాహనం పార్క్ చేసి ఆసుపత్రి లోకి వెళ్తున్నా. ఈలోగా వెనకనుండి "మేడమ్ " అన్న కేక వినిపించింది. నేను వెనక్కి తిరిగి చూసా.
ఒకమ్మాయి నా స్టూడెంట్ ట.ఇంకో బడిలో నా దగ్గర చదివిందట. ఓ పదేళ్ళ తర్వాత నన్ను కలిసింది. వెనకనుండి జడ చూసి పోల్చుకుందట.
కానీ ఏదీ శాశ్వతం కాదు కదా.
No comments:
Post a Comment