Friday, 1 November 2024

నిరాడంబరం

 #

ఇది నా  స్వీయ  రచన. 


నిరాడంబరం


విమల, ప్రశాంత్ చిన్న ఇల్లు అద్దెకి తీసుకొని ఉండేవారు. విమల  తండ్రి, ప్రశాంత్ తల్లి  వారితో ఉండే పరిస్థితి ఏర్పడింది. ఇంకో ఇంటికి మారదాం అనుకుంటుంటే

ప్రశాంత్ స్నేహితుడు "మేము అమెరికా వెళ్ళాలి.కానీ మా ఇల్లు  

ఇంకెవరికీ అద్దెకి ఇవ్వడం మాకిష్టం లేదు. వాళ్లు ఇల్లు పాడుచేస్తారేమో అని భయం.మీరు ఇల్లు న ఉంచుతారు. మీరే మా ఇంట్లో ఉండండి " అని చెప్పేడు. 


వాళ్ళు కొత్తగా మారిన ఇల్లు పెద్దది.చాలా సౌకర్యంగా ఉంది.ఐతే అక్కడ సొంత అపార్ట్ మెంట్ కొనుక్కున్న వాళ్లు ఎక్కువ మంది డబ్బున్న వాళ్ళే.

విమల అంతకు ముందు ఉద్యోగం చేసేది. ఇప్పుడు పిల్లల చదువు, తండ్రి, అత్తగారు ఇద్దరినీ చూసుకోవడం వీటితో ఉద్యోగం మానేయాల్సి వచ్చింది. 

విమల కట్టుకునే బట్టలు, పెట్టుకునే నగల గురించి ఎక్కువ ఆలోచించేది కాదు. అత్తగారు మాత్రం "ఎప్పుడూ ఈ చీరలేనా?

మరో రెండు కొనుక్కోవచ్చుగా" అనేవారు. పిల్లలకీ "అవే బట్టలు  వేయకండి. మరో రెండు జతలు కొనండి" అనేవారు. ఎదిగే పిల్లలకి  కొన్నా కొన్నాళ్ళకే పక్కన పెట్టేయాలి కదా అనేది విమల.


అక్కడ తల్లితండ్రులు పిల్లలకి రకరకాల ఆటవస్తువులు, బూట్లు అన్నీ కొనేవారు. విమల పిల్లలు కూడా అవి చూసి తమకీ కావాలని అడిగేవారు. అవసరాన్ని బట్టి విమల కొనేది కాని అలా అన్నీ కావాలని అడగకూడదు అని నచ్చచెప్పేది.


అక్కడ పండగలయితే ఆడవాళ్ళు  పట్టుచీరలతో మెరిసేవారు.నగలతో ధగధగలాడేవారు. అత్తగారు ఆవిడ నగ విమలకిచ్చినా పెట్టుకోవడం  విమలకి ఇబ్బందిగా ఉండేది.కానీ ఆవిడ కోరిక కాదనేలేక పోయేది.

ప్రశాంత్ కి  మరి కొంచెం మంచి ఉద్యోగం రావడంతో, ప్రశాంత్  కొత్త  ఉద్యోగం లో చేరేడు. ప్రశాంత్ ఇప్పుడు  రెండు రోజులు 

ఆఫీసుకి వెళ్ళినా మూడు  రోజులు ఇంటి నుండి పనిచేస్తాడు.


విమల మళ్ళీ ఉద్యోగ ప్రయత్నాలు మొదలెట్టింది. దగ్గరలో వున్న ఓప్రైవేటు కళాశాలలో  పార్ట్ టైం లెక్చరర్ గా చేరింది. ఆమె నిరాడంబరత గురించి ఆమె విద్యార్ధులు

మాటాడుకుంటూనే ఉంటారు.

No comments:

Post a Comment