Friday, 1 November 2024

చిట్టి 2

 ఇది నా స్వీయ రచన 


చిట్టి -2


చిట్టి  తాత తో పార్కు కి వెళ్ళింది. ఏదో  చెప్తోంది. తాతకి అర్ధం కావడంలేదు."జోకు" అని గట్టిగా నవ్వడం మొదలుపెట్టింది. 


తాతని ఇంటి నుండి తన సైకిల్ తెమ్మంది.పార్కు దాకా వచ్చేక సైకిల్ సీటు పైకి లేపింది. చూస్తే ఏవేవో సామాను. కొన్ని బయటకి తీసింది.

"అన్నవి కూడా తెచ్చేవు. పోతాయేమో" అన్నాడు తాత.

"డోంట్ వర్రీ " అని తాతకి ధైర్యం చెప్పి పండు దగ్గరకి పరిగెత్తింది. 


చిట్టి జారుడు బల్ల కింద వుండి పైకెక్కుతుంటే "పాపా,అలా ఎక్కకమ్మా" అంటే  "ఓ.కే" అంటూ ఉయ్యాల వైపు  పరిగెత్తింది.


నిండా రెండు  సంవత్సరాలు లేని పాప ఎన్ని  మాటలు నేర్చేసుకుందో అనుకున్నాడు తాత.

No comments:

Post a Comment