Friday, 1 November 2024

చిట్టి 1

 ఇది నా స్వీయ రచన 


చిట్టి 


చిట్టి  "బువ్వ  బువ్వ "అని జపం చేయడం మొదలెట్టింది.


భార్యామణి ఆఫీసుకెళ్ళింది


రోజూ చిట్టి  సరిగ్గా తినడం లేదని వాళ్ల అమ్మ ఫిర్యాదులే.


" బువ్వ అంది కదా.ఇక ఫరవాలేదు" అనుకున్నాను. 

కంచం తీయగానే ఫ్రిజ్ తలుపు తీసి నెయ్యి డబ్బా మోసుకొచ్చింది చిట్టి. 

నేను చాలా ముచ్చట పడిపోయా.

అన్నట్లో ముందు నెయ్యి వెయ్యిమంది. 

"ఆహా అదా పద్ధతి అనుకుని కొంచెం గట్టి నెయ్యి వేసేను. 

"అగ్గ బువ్వ " డిమాండ్ చేసింది చిట్టి. 

నేను కొంచెం కూర పెట్టి  వేడి అన్నం పెట్టి చల్లారపెడుతున్నాను.


"చెక్క పప్పు " అంది చిట్టి. 

దాని భాషలో జీడిపప్పు. 

ఓ రెండు పలుకులు వేసాను.

చిట్టి గబగబా నెయ్యి లాగించేసింది.

రెండు జీడి పలుకులూ నోట్లో పడేసుకుంది.

ఉత్తి అన్నం రెండు కళ్ళు రుచి చూసింది. 

"ఎస్కేప్ "అని అక్కడ నుండి పారిపోయింది చిట్టి. 

అది రోజూ అలానే చేస్తుందట.

No comments:

Post a Comment