Friday, 1 November 2024

అవకాశం

 అవకాశం 


చిన్ననాటి స్నేహితురాలు ,చరిత అంటే  నాకెంతో ఇష్టం. ఆమెకి నా ఇష్టం బాగా తెలుసు. ఆమె నేను తనని ప్రేమిస్తున్నానని నేనే చెప్పాలని ఎదురు చూస్తుందనిపిస్తుంది.


చరిత పుట్టిన రోజుని పండుగలా స్నేహితులతో కలిసి సంబరంగా జరుపుతాను. నా మనసుకి నచ్చినదేదైనా కానుకగా ఇస్తుంటాను.

కానీ తనతో జీవితం పంచుకోవాలని ఉంది అని చెప్పడానికి ఏదో  బిడియం. ధైర్యం చేసి  చెప్తే , చరితకి ఆ ఉద్దేశ్యం లేకపోతే  నాకు  ఎక్కడ దూరమైపోతుందో అని భయం.

చరితకి  ఉద్యోగం వచ్చి బెంగుళూరు  వెళ్లిపోయింది. నేను  మా ఊళ్ళోనే ఉద్యోగం చేస్తున్నాను. అమ్మని విడిచి దూరంగా వెళ్లలేను. చరిత దగ్గరగా ఉన్నన్నాళ్ళూ నా  మనసులో  మాట చెప్పక ఒక అవకాశం పోగొట్టుకున్నా ననిపించింది.

కొన్నాళ్ళకి  చరితకి  ప్రమోషన్ వచ్చి తిరిగి మా ఊరికే వచ్చింది. ఇది  నా  ప్రేమకి దొరికిన రెండవ అవకాశం. ఈసారి ఈ అవకాశాన్ని జారవిడుచుకోకూడదు అనుకున్నా.


ఒకరోజు చరితని కలియడానికి ఒక పార్క్ కి రమ్మన్నా. చరిత అక్కడకి  వచ్చింది. "నువ్వు  నాతో  మా ఇంటికి రావాలి" అన్నా చరిత తో

"ఎందుకు? " అడిగింది చరిత. 

"నా ప్రేమని నువ్వు అంగీకరిస్తే , నువ్వు  మా అమ్మని కలియాలిగా " అన్నా.

" అబ్బో, చాలా  ధైర్యమొచ్చిందే. పద వెళ్దాం " అంటూ నాతో  బయలుదేరింది చరిత.

No comments:

Post a Comment