ఇది నా స్వీయ రచన
ఫిడేలు రాగాలు
కాలం గొంతులో
ఫిడేలు రాగాలు
సాధారణంగా
మోహనరాగం
అప్పుడప్పుడూ మౌన రాగం
పెళ్ళి బాజాలు మోగినపుడు
కళ్యాణి రాగం
పసిపాపల నవ్వులలో
భూపాల రాగాలు
కాలం కులాసాగా
తీసుకు పోతున్నప్పుడు
కమనీయ గానాలు
కావలసిన వాళ్లని
తనతో
తీసుకెళ్ళి పోతే
వేదన
రోదన
శృతి తప్పిన గానమౌతుంది
జీవితం
No comments:
Post a Comment