Friday, 1 November 2024

దైవం మానుష్య రూపేణా

 ఇది నా స్వీయ రచన 

దైవం మానుష్య రూపేణా 


రామయ్య కి వరసగా మూడో సారి పంట నష్టం. ఎన్నో  ఎకరాల ఆసామి చివరాఖరికి బక్కచిక్కి పోయేడు.  నష్టాల ఊబిలో  కూరుకుపోయేడు

రామయ్య కి చిన్న  మామిడి తోట  ఉంది. ఎప్పుడూ  దానికి  సత్తెమ్మ  కాపు కాస్తుంటుంది.సతైమ్మ ముసిలయిపోయినా పిల్లల దగ్గర  ఉండకుండా ఎంతో కొంత  సంపాదించుకుని గంజి కాచుకుంటుంది.

మూడు రోజులై సతైమ్మకి జ్వరం‌. అలానే తోట కాసింది. నాలుగో రోజు  మరి లేవలేదు. అది చూసి రామయ్య  ఆసుపత్రి కి తీసుకెళ్ళాడు. వాళ్ళు  పట్నం 

తీసుకెళ్ళి పొమ్మన్నారు. పట్నం తీసుకెళ్ళాక  అక్కడ చాలా  ఖర్చవుతుందన్నారు.రామయ్యకి ఏం చేయాలో  అర్థం కాలేదు. అకస్మాత్తుగా గుర్తొచ్చింది. తనకో బంగారు పన్ను ఉందని. బాగా బతికున్న రోజులలో పెట్టించుకున్న పన్ను అది. వెంటనే  పంటి ఆసుపత్రికి ‌పరిగెత్తి ,పన్ను  పీకించుకొని ఎంతో కొంత డబ్బులిమ్మని అడిగాడు. ఆ డాక్టరు జాలిపడి కొంత సొమ్ము  ఇచ్చేడు. దానితో రామయ్య సతైమ్మ కి వైద్యం చేయించేడు.

"దేవుని దయవల్ల ముసల్ది బతికింది " అనుకున్నాడు  రామయ్య.

No comments:

Post a Comment