ఇది నా స్వీయ కవిత
నిశ్శబ్దం
నాచుట్టూ
నాలోపల
నిశ్శబ్దం
ధృవప్రాంతపు మంచులా
గుక్కెడు నీరిచ్చి
గొంతు తడపలేని
ఉప్పు సముద్రం లా
మహా సాగరంగా
తడి ఆర్చుకుపోయి
పొడిపొడిగా రాలుతున్న
ఎడారి ఇసుకలా
నాచుట్టూ
ముళ్ళకంచెలా
ముళ్ళ కిరీటంలా
ముందుకు సాగని
గడియారం ముళ్ళుగా
నాలో నిశ్శబ్దం
నా చుట్టూ నిశ్శబ్దం
(12.10.04)
No comments:
Post a Comment