ఇది నా స్వీయ రచన
చిట్టి -3
చిట్టి వాళ్ళ అన్న వాళ్ళ అమ్మ దగ్గరకి ఏడుస్తూ వచ్చేడు. ఎదురింటి అబ్బాయి ఏవేవో కబుర్లు చెప్పి భయపెట్టేడు.వాడికి భయమేసి ఏడుస్తూ చెప్పేడు.
అదంతా చూస్తున్న చిట్టి కి కోపమొచ్చింది. గబగబా ఎదురింటి అబ్బాయి దగ్గరకి వెళ్లింది. "నో,రుద్ర్ " అని గట్టిగా చెప్పి, వేలు చూపించి వార్నింగ్ ఇచ్చి మరీ వచ్చింది.
అన్న టి.వి చూస్తుంటే ఏదో ఒకటి తెచ్చి నోట్లో పెట్టేస్తుంటుంది. వాడు కూడా హాయిగా తినేస్తుంటాడు.
ఆదివారం పెద్ద పనివున్నట్టు "అన్నా లే స్కూల్ " అని లేపేస్తుంది. వాడికి ఆదివారం బడి లేదని తెలుసు. చటుక్కున లేచి చెల్లితో కలిసి కోతుల రాజ్యం నెలకొల్పుతాడు.
No comments:
Post a Comment