అనునయం పొందేవరకు
నా మనసు
నిలకడగా లేదు ...
పెళ్ళయి అత్తవారింటికి
వెళ్ళే ప్రతీ అమ్మాయిలా.....
పుట్టింటి బంధం
కలకాలం. ....
శాశ్వతంగా పుట్టింటిని
వదిలి వెళ్లడం
అదెంత కష్టం.....
పుట్టింటి బంధాలు
రక్త సంబంధాలు. ...
అన్నదమ్ములతో
రాఖీ పండుగ.....
అక్కాచెల్లెళ్ళతో
మాటల గలగలలు...
అమ్మ ఒడిచేరి
పసిపాపలా అల్లరి చేయడం ......
నాన్నతో పాటు
ఊరంతా తిరిగి రావడం ......
స్నేహితులతో
సినిమా సరదాలు. ....
తెలిసిన ఊరు
అలవాటయిన వాళ్ళు. ..
ఇప్పుడు
కొత్త బంధాలు. ..
ఈ ఇంటి మహరాణిని
మహాలక్ష్మిని మరి మెట్టినింట ......
ఆటపాటల రోజులు గడిచేయి
ఇంటి ఇల్లాలిగ మసలే తరుణం ఇకపై .....
ఎన్నో బాధ్యతలు
మోయాల్సిన బరువులు. ...
భార్యగా
కోడలిగా
నూతన పాత్రలు. ..
వివాహ బంధాన్ని
ప్రేమ బంధం గా
మార్చుకోవాలని చిలిపి తలపులు.....
కొత్త పెళ్లి కూతురికుండే
కోటి కోర్కెలు .....
పుట్టింటి పై బెంగ
లోలోపల దాచుకుంటూ. .....
నిలకడ లేదు మనసుకి
భర్త అనునయం
పొందేవరకు.......
No comments:
Post a Comment