Monday, 7 November 2011

vyaya aadaayaalu

సోనియా ఐడియా 
జాతి జీవనాన్నే మార్చివేస్తుంది 
కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు 
ఏపధకాలు చేపట్టినా 
క్రీనీడలా వెన్నంటి వుంటుంది 
ప్రపంచ బ్యాంక్ నెట్ వర్క్ 

అసెంబ్లీలో ఆవేశాకావేశ ప్రసంగాలు 
కడుపుకి అన్నమా -చేతికి గాజులా-
వ్యర్ధప్రశ్నలు 
హత్యాకాండల సత్యాలను 
బట్టబయలు చేస్తున్న చట్టసభలు 

దేశభాషలందు తెలుగు లెస్స 
తెలుగునాట తెలుగు లేస్సే 
దేశంలో తెలుగుమాటదే రెండో స్థానం 
ఏవాశి బలమూ -ఏ రాశి ఫలమూ 
కల్పించలేని ప్రాచీనత 

అదేమీ దుర్గతో-మరేమిసంగతో 
తెలుగు ప్రాచీనతకి కరువైన ప్రాపకం 
కమిటీ కూటాల కుమ్ములాటలు కావు 
కలంతో కలకలం రేపే 
కవుల గళాలు గర్జించాలి 

రాజకీయ నాయకుల నీచభాషతో
చవకబారు సినీభాషతో 
తెలుగు పతనమయ్యేకన్న 
మమ్మీ డాడీ అన్నా
ఆంగ్లంతో పెనవేసుకున్నా   
సంస్కారంతో కూడిన భాషే మిన్న 

సున్నా బూచితో బెదిరించి 
ప్రాణాలు తీసే కీచకాచార్యులు ఎందరెందరో
అమ్మాయిల బతుకునీ భవితనీ
కాటువేసే విష-మగ-నాగులెన్నో 

అందుకే అచ్చ తెనుగు అక్షరాలు
తమని దర్పణంగా మార్చి 
అద్దం  పట్టమంటాయి 
రాజకీయ అరాచకాన్నీ
సమాజంలో పైశాచికత్వాన్నీ  

పార్ధివపరిస్థితి 
ఈ దుస్థితిలో ఉంటే
వ్యయ వత్సరంలో ఎన్ని ప్రయాసలో 
అయినా సంధిద్దాం
పదునెక్కిన మన అక్షర బాణాల్ని 
సాధిద్దాం వ్యయ వత్సరంలో 
విజయాల ఆదాయాల్ని 

25 .3. 2006 
ఉక్కుసాహితి కవిసమ్మేళనం

No comments:

Post a Comment