Monday, 14 November 2011

ayomaya sarwajit

పేరుకి శాశ్వత సభ
గతం అశాశ్వితం
భవిత ప్రశ్నార్ధకం
నేడది నూతన శిశువు
ప్రాణం పోసేది ఆయువు తీసేది
అధికారపక్షాలు

మృత భాషలో మార్కులపంట
తెలుగు నోట దొరలభాష
తెలుగునాట నిర్జీవమవుతున్నమాతృభాష

పవిత్ర వృత్తివిద్యాకళాశాలలలో
పైశాచిక ర్యాగింగులు
ఆత్మహత్యతో  అంతమయ్యే
అన్నదాతల బతుకులు

అర్ధనారీశ్వరత్వం ఆవిష్కరించినా
ఆ పరమశివుడు-
చట్టసభలలో మహిళా రిజర్వేషన్
అమలుకి తావివ్వని రాజకీయపక్షాలు
ఆడశిశువు జన్మించే హక్కు సైతం
కాలరాసే భ్రూణహత్యలు

తెలుగునాట
వేరు కుంపట్లు ప్రాంతీయవాదాలు
రాష్ట్రాన్ని తెలుగు తమ్ముళ్ళు
వాటాలేసుకున్నా
తెలుగుసంస్కృతిని త్రివేణీ సంగమంగా
పదిల పరుచుకుంటూ మెరుగుపరిస్తే
అదే పదివేలు

అయోమయంతో అడుగిడుతున్నసర్వజిత్
 స్థిర విజయాలనే సాధిస్తుందని ఆశిద్దాం

18 .3 .2007 
ఉక్కుసాహితి ఉగాది కవిసమ్మేళనం 


  

No comments:

Post a Comment