Sunday, 13 November 2011

virodham vaddu, virodhee....

కరెంటు ఉచితం
కలర్ టీవీ ఉచితం
సెల్ ఫోన్ ఉచితం
అయాచితంగా వచ్చిపడిన  పేదరికానికి
అన్నీ ఉచితమే ఎన్నికల సమయంలో

కార్పొరేట్ కాలేజీల
అమ్మకపు సరుకు
అమ్మానాన్నల సుందర స్వప్నం
యువతీయువకుల డాలర్ డ్రీమ్స్
అన్నీ కొట్టుకుపోతున్నాయి
ఆర్ధిక మాంద్యంలో
చిద్రమౌతున్నాయి మానవ సంబంధాలు

సత్యం మిథ్యగా మారినవేళ
సత్యాన్ని తిరగేసి
తలరాతలు తిరగరాసినవేళ
వాపాబలుపా మీమాంసకి సమాధానం
సాఫ్ట్ వేర్ సంక్షోభం

యత్ర నార్యన్తు పూజ్యతే
తత్ర దేవతా రమంతే
వేదభూమిలో
అతివలను వెంట తరిమిన
హిందూతాలిబాన్లు
సంస్కృతి దిగజారుతోందంటూ
మరింత దిగజారుతున్న కుసంస్కారులు

తాజ్ లో పేలిన తూటాలకి
 ఉగ్రవాదచర్యలకి
ప్రేమోన్మాద ఏసిడ్ దాడులకి
ఆధార భూతమయ్యింది
సర్వధారి వీటన్నిటికీ

అజ్ఞాన తిమిరాన్ని అధిగమిస్తూ
విరోధిద్దాం విరోధిలోనైనా
అమాయకత్వంతో పేదరికంతో
వాగ్దానాల వ్యపారంచేసే
తుచ్ఛ రాజకీయాల్ని

విరోధిద్దాం పైశాచిక చర్యలూ
పాశవిక దాడులూ
అణిచివేత -దోపిడీ

విరోధిలో విరోధం వద్దు
సమైక్యతే ముద్దు ఎప్పటికీ.....

21 .3 .2009
ఉక్కుసాహితి ఉగాది కవిసమ్మేళనం



No comments:

Post a Comment