విరించి రచించాడో
నూతన చరిత
నానమ్మలుగా అమ్మమ్మలుగా
పదోన్నతి
అభినవ రాయలు
అడుగు పెట్టేడు తెలుగింట - రాజసంగా -
ఇద్దరు నాయనమ్మల పైత్యం
ప్రకోపిస్తే మరింత
ఎడపెడా రాసేస్తాడు
తెలుగు,కన్నడ,ఆంగ్లేయాలలో
నాన్నతో - అమ్మతో
అందరితో డాన్స్ చేయించేస్తాడు
ఏడాది నిండకనే అన్నిరకాల వూపులు
నేర్చి మైఖేల్ జాక్సన్ - ప్రభుదేవా
మరెందరెందరినో తలపిస్తాడు
మరిపిస్తాడు మునుముందు -
దాడి చేయకండి సుమీ
వాడి ముద్దొచ్చే బుగ్గలపై
ఆపిల్ పళ్ళే అవి మరి
ఆనందించండి 'ఫెదర్ టచ్' తో -
వారసుడు కాకరపర్తికి -
పౌరసత్వం అమెరికా -
దసరా సరదాలను
దీపావళి వెలుగులను
మోసుకొచ్చేడు
కానుకలుగ
మూడు తరాలకి -
హైద్రానిండా
ఎటు చూసిన ముత్తాతలు
తాతలే
అచ్చ తెలుగులో నేర్చుకో
తాతా అని నోరార పిలువ
మళ్ళీ కలిసేసరికి
ఎంత ఎదుగుతాడో మనవాడు
మా ముద్దుల మనవడు
నానమ్మ శుభాకాంక్షలు నిరంతరం
చిరు ముద్దులు లేలేత బుగ్గలపై ప్రతిరోజూ
22nd oct; 2011
No comments:
Post a Comment