Monday, 14 November 2011

hamee iddaam

విరోధినుండి
వికృతిలోగా

ఓచిర పరిచిత నవ్వు
రాలిపోయింది
నమస్తే అక్కయ్యా నమస్తే చెల్లెమ్మా
నమస్తే అన్నయ్యా నమస్తే తమ్ముడూ -అంటూ
సందడి చేసే ఆ నవ్వులరేడు
తొందరపడి ముందే సెలవుతీసుకున్నాడు

కృష్ణమ్మ తుంగభద్రలు
ఉప్పొంగితే - ఉప్పెనే
ప్రజల జీవితాల్లో
వరద మోసుకొచ్చిన
రాజకీయ బురద
ఇంకా వదిలించుకోలేని ప్రభుత

మహిళా బిల్లు
పురుషాహంకారాల నడుమ
కొట్టుమిట్టాడుతోంది

నానాటికీ వేడెక్కుతున్న ధరిత్రి
అంతకు మించి వేడెక్కుతున్న
రాష్ట్ర రాజకీయాలు

తెలంగానం - బృందగానమయింది
అన్నదమ్ముల నడుమ
అభివృద్ది గణాంకాలు
అవసరమయ్యేయి

జగన్నాటక సూత్రధారి
రంగ ప్రవేశం  రాష్ట్రంలో
జగన్నాధ రధచక్రాల గమనం - మరెటో

రాష్ట్రచీలిక అనివార్యమైనా
తల్లి అవిభాజ్యం
తేనెలొలుకు తెలుగు ప్రగతికి
హామీ ఇద్దాం - బిడ్డలందరం

2010 ,ఉగాది కవిసమ్మేళనం 







 

No comments:

Post a Comment