Tuesday, 8 November 2011

sahasrabdi

విప్లవాల సహస్రాబ్ది
స్వేచ్ఛా సమానత్వాలకిది పునాది
నిరంకుశత్వాన్నెదిరించి  
బాస్టిల్ లో  ఘన విజయం సాధించి 
విజయబాపుటా ఎగరేసిన  ఫ్రెంచివిప్లవం 

రాచరికాన్ని పరిమితం చేసి 
ప్రజాస్వామ్యానికి పట్టంకట్టిన 
రక్తరహిత విప్లవం

ప్రాతినిధ్యం లేనిదే పన్నుకట్టమని 
సామ్రాట్టునే సవాలుచేసి 
స్వేచ్చాదుందుభి మోగించి 
వలసపాలన అంతం చేసిన అమెరికన్ల పోరాటం 

పనిహక్కును విద్యాహక్కును కల్పించి
సమసమాజానికి రాచబాటైన
రష్యన్ విప్లవం 

ధనికస్వామ్య కోరలనుండి
పేదరైతుల చెర విడిపించి 
సుదీర్ఘయాత్రలోఅమరులైన 
చైనావీరుల ప్రజావిప్లవం 

మండే ప్రతి హృదయం విప్లవమై 
పలికే ప్రతిమాటా ఆయుధమై 
విప్లవాల సహస్రాబ్ది 
సామ్యవాద నవశకానికి నాంది

డిసెంబర్ ,1999


No comments:

Post a Comment