సర్వజిత్ మీమాంసలు
సర్వధారి సమాధానాలు
మాయావతితో మంతనాలు
చంద్రబాబు తో చెట్టపట్టాలు
తమ్ముడు వాయువేగం
బామ్మర్ది మనోవేగం
మెగాస్టార్ మౌనానికి మరి కారణం
అధికార ప్రతిపక్షాలకి
సొంత గూళ్ళలో ఎదురు దెబ్బలు
రిలీజ్ కాని బొమ్మకి పబ్లిసిటీ ఆర్భాటం
రాష్ట్ర రాజకీయాల్లో చిరుగాలే పెను తుఫానా
సర్వధారి సమాధానానికెదురు చూద్దాం
సర్వజిత్ లో పరాకాష్ట కి
చేరుతుందనుకున్న తెలంగానం
సర్వధారి వరకూ రావణ కాష్టమే
తెరాస రాజీనామా రాజకీయాలు
మౌనం వీడని madam
ఏఉగాది తెలంగానానికి తెర ఎత్తనుందో
తెలంగాణ వాదానికి తేరా దించనుందో
తెలంగాణమా-సమైక్యంధ్రమా -అదే మీమాంస
సర్వధారి సమాధానానికెదురుచూద్దాం
మధ్యంతరం తధ్యమన్న
పతాక శీర్షికలు
వార్షిక బడ్జెట్ లో వరాల వెల్లువ
అప్పుడే ఎన్నికలా
అవాక్కైనజనం
సర్వధారిలో సైతం వేలాడుతున్న
డమక్లేస్ ఖడ్గం
మధ్యంతరమా -సాధారణమా
సర్వధారిలో సమాధానానికెదురుచూద్దాం
వందకి చేరుకున్న వంటనూనె
కొందామన్నాదొరకని కూరగాయలు
కొండెక్కి కూర్చున్న వెచ్చాల ధరలు
మీమాంసకి తావులేని ఆర్ధిక అవస్థలు
ఉగాదినాడు ఉగాది పచ్చడే విందుభోజనం
నిత్యం ఛస్తూ బతికేవారికి
నవ్వుల టానిక్ -నేటి రాజకీయాలే
ఉక్కుసహితి ఉగాది కవిసమ్మేళనం ,2008
ఉక్కుసహితి ఉగాది కవిసమ్మేళనం ,2008
No comments:
Post a Comment