Thursday, 10 November 2011

ennikala tharanam

మహిళలకి చట్ట సభలలో 
మూడోవంతు సీట్లు కేటాయించకుండానే 
ఎన్నికలొచ్చేసాయి

యువతకి బీదాబిక్కికి
ఉపాధికల్పన లేకుండానే 
ఎన్నికలొచ్చేసాయి  

ప్రపంచ బ్యాంకు రుణాలు 
తీర్చాల్సినది ఎన్నితరాల భారతీయులో
తేలకుండానే ఎన్నిక లొచ్చేసాయి 

సరళీకరణ -ప్రపంచీకరణ -
ప్రైవేటీకరణ విధానాలతో 
లాభపడ్డది అభివృద్ధి చెందిన దేశాలో 
సగటు భారతీయుడో-
నిరుపేద కార్మికుడో-కర్శకుడో 
తేలకుండానే ఎన్నిక లొచ్చేసాయి

సూడో  సెక్యులరిజాలూ
స్టాంపుల కుంభకోణాలూ
ఏవీ ఓ కొలిక్కి రాకుండానే
ఎన్నికలొచ్చేసాయి

కాషాయం చదువునీ సంస్కృతినీ
కాషాయీకరిస్తుందో
హస్తం అధికారం హస్తగతమయ్యాక
రిక్త హస్తమే చూపిస్తుందో

రాష్ట్ర ఆర్ధిక సాంఘిక 
ద్విచక్రాలకి పంక్చర్లే పడతాయో 
ఏదీతెలియని అయోమయంలోకి 
జనతని నెట్టేసి ఎన్నికలొచ్చేసాయి

తారణ ఉగాది
ఉగాది పచ్చడి కసింత చేదయినా
తెలుగుతనమంత కమ్మగా ఉంటుంది 
సగటు మనిషి బతుకు 
కటిక చేదు కాకుంటే అంతే చాలు 

ఎన్నికల -గ్రీష్మ -తాపాలతోవేడెక్కుతున్న 
భరతభూమి మేలైన నాయకుల 
ఎన్నికతో చల్లబడితే అంతేచాలు 

ఉక్కుసాహితి ఉగాది కవిసమ్మేళనం
18 .3 .2004













No comments:

Post a Comment