Sunday, 20 November 2011

khara bharatham

ప్రపంచకప్
ధోణీ సేనకందించి
మనల్ని అజేయుల్ని చేసి
స్నేహ పూర్వకంగా నిష్క్రమించింది వికృతి

ధారావాహికాల టి.ఆర్.పీలన్నీ
దారుణంగా పడిపోయేయట
ఆంటీలందరికీ ప్రపంచకప్ రియాల్టీ షోవే
తెగ నచ్చేసిందట

జాతీయక్రీడ హాకీ
కుర్రకారు ఉర్రూతలూగేది సచిన్ఆటకి
ప్రత్యక్ష ప్రసారాలలో
యావజ్జాతి తలములకలయినా
మీడియా చర్చిస్తుంటుంది
గెలుపు ఓటములు నిర్ణయించేది
జట్టు నైపుణ్యమా బెట్ మయాజాలమా అని

టాంక్ బండ్ సాక్షిగా
కూలిన తెలుగు వెలుగులు
ఆరువందలమంది ఆత్మబలిదానాల
మాటేమిటన్న తెలంగాణావాదం
తెలంగాణా తంత్రులు
సోనియమ్మ సవరిస్తే
ప్రత్యెక రాష్ట్ర సంగీత విభావరులు
పలు ప్రాంతాల్లో

వెనుకబడిన వర్గాలకి
రిజర్వేషన్లని ఏభైలలోనే
అమలుచేసిన రాజ్యాంగం
చట్ట సభలలో మహిళా రిజర్వేషన్లని
మరో అరవైవత్సరాలకి  సైతం
చట్టబద్ధం చేయకపోవడం
మచ్చుతునక  పురుషవేతల
దురహంకారానికి
మరోసారి జన్మించి అంబేద్కర్ మహిళగా
మహిళా రిజర్వేషన్ చట్టంకోసం
చేయాలేమో అవిశ్రాంత పోరాటం

కోట్లకి పడగెత్తిన వారికి
స్కేమ్లు వేడివేడిపకోడీలు
సామాన్యుడికి సంబంధంలేని
వికీలీక్స్ స్పైసీమసాలాలు
ఇరవైనాలుగ్గంటల న్యూస్ ఛానల్స్ కి
అవేమరి విందుభోజనాలు

స్వపక్షంలోనే
ప్రతిపక్షాన్నితలదన్నేవిపక్షం
రాజకీయనాయకుల
వ్యూహప్రతివ్యుహాలు
సరికొత్త రాజకీయపుంతలు
భారతావనిలోవింతలు

నేటిభారతంలో
ఎన్నెన్ని మహాభారతాలో
వరసిద్ధి వినాయకా
జరచూడవయ్యా
ఖర భారతాన్ని కాస్తకాపాడవయ్యా

3 .4 .2011
ఉక్కుసాహితి ఉగాది కవిసమ్మేళనం      
  

No comments:

Post a Comment