Saturday, 26 November 2011

camp andaman

అది నా తొలి విమానప్రయాణం
మేఘాల మీదుగా
కింద బంగాళాఖాత అలలు

దూది పింజల మబ్బుల్లోంచి
శరవేగంగా కిందకిదిగి
వీరసవార్కర్ విమానాశ్రయం
చేరింది విమానం

మెయిన్ ల్యాండ్ నుండి దూరంగా అండమాన్
అన్ని వైపులా సముద్రమే
పోర్ట్ బ్లేయర్
సెల్ల్యులర్ జైల్
రాస్ఐలాండ్

లంచ్ టైంలో
కురిసిన కుంభవృష్టి
వెహికిల్ ఫెర్రీమీద
కార్లు జీపులు సైకిళ్ళు

ఒడ్డుకు చేరగనే
రణగుణధ్వనితో ఫెర్రీమీంచి
రోడ్డుమీదకి దూసుకుపోయే వాహనాలు   

పోకచెట్లు
రక్తంపీల్చే జలగలు
మ్యాంగ్రూవ్స్
సముద్రంలో కోరల్స్

తిరుగుప్రయాణం-
రికార్డ్ వినిపిస్తూ అభినయిస్తూ
జాగ్రత్తలు చెప్పే ఎయిర్ హోస్టెస్

క్యాంప్ అండమాన్
అందమైన జ్ఞాపకం

అక్కడ ఓరాత్రి
రోడ్డుమీద నడుస్తుంటే
నిశ్శబ్దాన్నిచీలుస్తూ
వినిపించిన శ్రీకాకుళంయాస
చెవినపడినప్పుడు నాఆనందం
వర్ణనాతీతం

16 .10 .2004        

No comments:

Post a Comment