సహనం సహకారం
సమర్ధత సౌశీల్యం
దయార్దహృదయం సహాయగుణం
ఇన్నిటి సమ్మేళనం అది నువ్వు
సాహచర్యం నీతో
సహగమనం నీతో
సావాసంనీతో సహవాసంనీతో
వసంతాలు నీతో
శరద్రాత్రులు నీతో
వెన్నెలహాయి నీతో
చిన్నారుల సిరులు నీతో
చిరునవ్వుల హొయలు నీతో
చిదానంద చిత్తం నీతో
మల్లెలు మరువాలు నీతో
జాజులు విరజాజులు నీతో
సంపెంగలు సౌరభాలు నీతో
గులాబీలు గుబాళింపులు నీతో
వెలుగురేఖల తొలిపొద్దు నీతో
సాయంసంజల సోయగాలు నీతో
ప్రేమ వరదై వరమై వస్తే అదినువ్వు
అభిమానం-అనురాగం
ఆత్మీయత-అపురూపం
అన్నీ కలగలిసి అది నువ్వు
No comments:
Post a Comment