Saturday, 19 November 2011

putrikotsham

పుత్రిక
విలువైన ఆస్తి
అపురూపమైన కానుక

అపుత్రస్య గతిర్నాస్తి అలనాటి నానుడి
నేటి తనూజ ఆత్మీయత అనురాగం
తల్లితండ్రులకు పంచి
తరింపచేస్తోంది వారిజన్మ

కుంచమంత కూతురుంటే
మంచందగ్గరకే కంచమట
ఆడపిల్ల  `ఆడ`పిల్లయినా
మనసంతా ఈడేనట  

కూతురు మన ఇంటి మహలక్ష్మి
మెట్టినింట గృహలక్ష్మి
అన్నదమ్ముల శ్రేయస్సు
అభిలషించే రక్తబంధం
రక్షా బంధనాన్ని బంధించే తోబుట్టువు

మనసున్న మనుషులకి
మమతలెరిగిన మనసులకి
పుత్రిక విలువ తెలిసింది నేడు 

కూతురిచ్చే వెలుగు
కుటుంబానికే వెలుగు
కూతురు విద్యవంతురాలయితే
కుటుంబం యావత్తూ
పొందుతుంది విద్యాగంధం

నేడు పుత్రికల దినోత్సవం
పుత్రికోత్సవం
గర్విద్దాం మనం పుత్రికలమైనందుకు
పుత్రికోత్సహాన్ని జనులీపుత్రికలని
ప్రశంసించినపుడు కలిగిద్దాం
తల్లితండ్రులకు

*on the occasion of daughters`day 

No comments:

Post a Comment