Wednesday, 9 November 2011

swaagatam

నీటిని చీల్చుకొని 
సముద్రంలో సముద్రంలో సాగిన జల ఉషలా 
జీవితాలను చీలుస్తూ 
సాగిపోయింది వృష 

నరనరాల్లో ప్రాణభీతి నింపిన 
గోద్రా మారణహోమం 
రావణ కాష్టమై రగులుతున్న మత విద్వేషం 

మైనార్టీల భయోద్వేగాల నడుమ 
అయోధ్యలో నాటకీయ శిలాదానం
పాశవిక హత్యలు దుర్మరణాలతో
మరింత ఎర్రబడ్డ మంచు లోయలు 

గోపురాలమీంచి కూలి రాలి పోతున్న 
తాజమహల్ పావురాలు 
ఉదయించకనే అస్తమిస్తున్న ప్రత్యూషలు 
కరెంటు షాకులతో కకావికలవుతున్న రైతన్నలు 

విద్యార్ధుల మస్తిష్కం నుంచి 
అంతరిస్తున్న కైబర్ కనుమలు 
ఆవిష్కరించబడుతున్న సైబర్ కేఫ్ లు 

అడుగడుగునా సుడిగుండాలే
అయినా -జన చైతన్యం 
నవోదయానికి నాంది

అందుకే ఆవాహన చేద్దాం 
తమస్సును సంహరించే 
కోటి ప్రభల రవితేజాన్ని 
సాదరంగా స్వాగతమిద్దాం 
నవ చైతన్య చిత్ర భానూదయలకి 


ఉక్కు సాహితి  ఉగాది కవిసమ్మేళనం,2002 



4 .4 .2002   

No comments:

Post a Comment