Tuesday, 29 November 2011

shuklapaksham taaralu

పంచమినాడు పుట్టింది
మా అమ్మ
షష్టిని  పంచుకున్నారు
నాన్నగారు శ్రీవారు
సప్తమిముత్తాత  అదే మా అమ్మతాత

మహానవమి కల్లా సంసిద్ధమయింది భవానీమాత
విజయ దశమిని పంచుకున్నారు
పెద్దత్త చిన్నకోడలు
మా అక్క మేనకోడలు
మేనల్లుడు సైతం దశమి నాదన్నాడు

ఏకాదశి సింధుపాప
పున్నమి తాతగారు విరించిబాబు

అన్నీశుక్లపక్షం తారలు
మెరిసేయి జిగేల్మని
పుట్టినరోజు శుభాకాంక్షలు
పుట్టబోయే పాపాయికి బుజ్జాయికి
శ్రీవారికి

29 .11 .2011

chittitallulu

ఒక తెలుగు
కాసిన్ని కుంకుడుకాయలు చాలు
ఆదివారం ఆనందాన్ని
ఆవిరిచేసేయడానికి 

అక్కా వేలు చూడు
పెన్సిల్ తో తెలుగు రాసిరాసి
జాలిగా వేలు చూపే చిట్టి చెల్లెలు

ఒక ముద్దు కాసింత ప్రేమ చాలు
ఉత్సాహానికి మరలా ఊపిరిపోయడానికి
చెంగుచెంగున గంతులు వేసే ఆ తువ్వాయి
నా చిట్టి పాపాయి

కొంత అమాయకత్వం
మరికొంత చక్కదనం
ఇంకొంత కష్టించే తత్త్వం
కలబోసిన అపరంజిబొమ్మ
ఎనిమిదీ ఏడు ఎనభై ఏడున
కేర్ మన్న ముద్దుల గుమ్మ
నేడది డాక్టరమ్మ

అక్కచెల్లెల్లిద్దరూ
అపూర్వ సోదరీమణులు

20 .2 .2000 /29 .2 .2011

Saturday, 26 November 2011

ukkunagaram

ఉక్కునగరం
ప్రశాంత తపోవనం

సిటీ సందళ్ళకి
బెజారెత్తించే ట్రాఫిక్ కి
 అన్నిటికీ దూరంగా

చల్లని గాలి తీయని నీరు
రోడ్లు రద్దీలేని రహదారులు
వుడ్స్ ని  తలపించే
చెట్లవరుసలు

ఆరుబయలు స్థలాలు
ఆటపాటల పిల్లలతో
కళకళ లాడే పార్కులు

ప్రశాంతత నింపుకున్న దేవాలయాలు
ఇక్కడ దేవుళ్ళు కూడా జన సమ్మర్ధానికిదూరంగా
హాయిగా విశ్రాంతి తీసుకుంటూ
మనశ్శాంతి ప్రియజనులకి ప్రసాదిస్తూ

ఉన్నవూరే కన్నతల్లి
విదేశంకన్నాస్వదేశం మిన్న
సాగరతీరం చెంతనున్న
ఉక్కునగరమే మాకుమిన్న

నిర్భాగ్యులైన నిర్వాసితులెందరికో
ఈ ఉక్కుపాదం రక్కసి పాదమైనా
మరెందరికో ఇది సుందర జీవితాన్ని
ప్రసాదించిన రామపాదం

4 .4 .2002   

samrambham

ముచ్చటగా మూడురెళ్ళు
మూడు సున్నాలు
పక్క పక్కన చేరినరోజు

ముచ్చటైన జంట పిచుకల
సంరంభం మాఇంట్లో

పనికట్టుకొని పొద్దున్నే
ఇంట్లో దూరి
ముక్కులతో చప్పుడుచేస్తూ

లెక్కలతో కుస్తీ పడుతున్న
పెద్దమ్మాయి తపస్సు భగ్నం చేస్తూ

అద్దంమీద ముక్కులతో టైపు చేస్తూ
చిన్నమ్మాయికి కనువిందు చేస్తూ

చేరువకి వెళ్ళగానే
తుర్రుమని ఎగిరిపోతూ

అద్దంలో తమ ప్రతిబింబాల్ని
మరో రెండని భ్రమించి స్నేహం చేస్తున్నాయో


బందీలని భావించి విడిపించ
విఫలయత్నం చేస్తున్నాయో    

గూటికోసమో గడ్డిపరక కోసమో
వేటికోసమో మరి ఆ వెతుకులాట

పిలవకనే వచ్చిన
అతిధులు ఆ రెండూ

వాటి ప్రతీచర్యని
పరిశీలించడమే పనిగా 
మానుండి దూరంగా అవి
పారిపోయిన ప్రతిసారీ
పెద్ద వెలితిగా

2 .2 .2000
*ఉక్కు నగరం నుండి
కనుమరుగయిన పిచుకలు  

abala kaadu sabala

శారదాచట్టం
బాల్యవివాహం

వీరేశలింగం
వితంతువివాహం

గురజాడ
కన్యాశుల్కం

రాజా రామ్మోహనరావు
సతీ సహగమనం

సంఘ సంస్కర్తల
కాలానికి కాలంచెల్లింది

మిగిలేవుంది వరకట్నం
మిగిలే ఉన్నారు వితంతువులు

ప్రతి సాంఘిక దురాచారం
బలి తీసుకుంటోంది అతివలనే

విద్య ఉద్యోగం ఉన్నతపదవులు
చైతన్యం మహిళాసాధికారం నిరూపించగలవు
అబలకాదు సబల
ఇరవైఒకటో శతాబ్దపుమహిళ అని   

27 .11 .2011

jeevitham

జీవితం
సుందర స్వప్నంగా
కరిగిపోని కలగా

అంతులేని ఆనందంగా
తీయని అనుభూతిగా

సుమధుర సంగీతంగా
రసవాహినిగా
నిత్య వసంతంగా
ఇట్టేగడిపేద్దాం

27 .2 .2000

tombhai rojulu

నువ్వులేని ఈ తొంభై రోజులు
ఒంటరిగా దిగులుదిగులుగా

నువ్వులేని ఈ తొంభై రోజులు గొంగళిలా
నా చుట్టూ ఒంటరితనంగూడు అల్లుకుంటూ

నువ్వులేని ఈ తొంభై రోజులు
తపస్వినిలా
ఇల్లే తపోవనంగా

అనుక్షణం నిన్నేకలవరించే చిన్నారులకు
అమ్మానాన్నాఅన్నీ అయి
ఈ తొంభై రోజులు తొంభై యుగాలుగా

14 .1 .2000

bassu prayanam

బస్ స్టాప్ లో నలుగురం ఉంటే
అప్పుడు మొదలౌతుంది పోటీ

బస్ ఆగేసరికి పరుగుపందెంతో
హడావుడిగా బస్ ఎక్కడం
ఎక్కీ ఎక్కగానే గద్దచూపులు
ఖాళీ సీట్ కోసం వెతుకులాట     
స్త్ర్రీలకు కేటాయించిన సీట్లని
ఖాళీ చేయమని
మగ ప్రయాణీకుల్ని
చూపుల్తో ఇబ్బందిపెట్టడం

ఎక్కడా ఖాళీలేకుంటే
తోటి ప్రయాణీకులు ఖాళీచేసే
సీట్ కోసం ఆశగా ఎదురుచూపులు
వారి కదలికలు నిశితంగా పరికిస్తూ

బస్ రష్ లో తొక్కిసలాట తోపులాట
ఊగిపోతూ తూగిపోతూ జారిపోతూ
కిటకిటలాడే బస్ లో సైతం
కండక్టర్ వెనుక నుండి ముందుకి
ముందు నుండి వెనక్కి
బొంగరంలా ఎలా తిరిగేస్తుంటాడో
కొత్త ప్రయాణీకులనెలాగుర్తిస్తాడో 
ఆయనకే తెలిసే చిదంబరరహస్యం

మియాపూర్ క్రాస్ రోడ్స్ -JNTU-
కూకట్ పల్లి హౌసింగ్ కాలనీ
సనత్ నగర్ flyover
ఎర్రగడ్డ  mental hospital
చనిపోయి సైతం లాఠీ ఝళిపించే ఉమేష్ చంద్ర
మైత్రీ వనం -అమీర్ పేట్
హమ్మయ్య చేరుకున్నా
గమ్యస్థానం

4 .6 .2004

daddy daddy

ఇహ నావల్ల కాదంటూ
మంచం చేరే
డాడీ గుర్తొస్తారు
అదివోయ్ సంగతంటూ
అమ్మపక్కన సెటిలయ్యే
డాడీ గుర్తొస్తారు

హే రుకురుకుమాం
స్టెప్పులు వేసి కుర్చీ తన్నేసిన
డాడీ గుర్తొస్తారు
దభీదభీమని చప్పుడు చేస్తూ
పిండి పిసుకుతూ ఆటలాడే
డాడీ గుర్తొస్తారు

గొంతుపెంచి కేకలువేసి
అంతా ఉత్తదేనని అభినయించే
డాడీ గుర్తొస్తారు
హాస్యం పండించే డాడీ
అనుక్షణం గుర్తొస్తారు
చదువుకోమని హెచ్చరించే డాడీ
పుస్తకం తెరిస్తే గుర్తొస్తారు

డాడీడాడీ మైడియర్ డాడీ
యు ఆర్ ది రియల్ హీరో
అందుకే మా మనసునేర్చిన మంత్ర మొక్కటే
పితృదేవోభవ
పితృదేవోభవ
పితృదేవోభవ

*చిట్టితల్లుల మనసుభాష
8 .3 .2000             

camp andaman

అది నా తొలి విమానప్రయాణం
మేఘాల మీదుగా
కింద బంగాళాఖాత అలలు

దూది పింజల మబ్బుల్లోంచి
శరవేగంగా కిందకిదిగి
వీరసవార్కర్ విమానాశ్రయం
చేరింది విమానం

మెయిన్ ల్యాండ్ నుండి దూరంగా అండమాన్
అన్ని వైపులా సముద్రమే
పోర్ట్ బ్లేయర్
సెల్ల్యులర్ జైల్
రాస్ఐలాండ్

లంచ్ టైంలో
కురిసిన కుంభవృష్టి
వెహికిల్ ఫెర్రీమీద
కార్లు జీపులు సైకిళ్ళు

ఒడ్డుకు చేరగనే
రణగుణధ్వనితో ఫెర్రీమీంచి
రోడ్డుమీదకి దూసుకుపోయే వాహనాలు   

పోకచెట్లు
రక్తంపీల్చే జలగలు
మ్యాంగ్రూవ్స్
సముద్రంలో కోరల్స్

తిరుగుప్రయాణం-
రికార్డ్ వినిపిస్తూ అభినయిస్తూ
జాగ్రత్తలు చెప్పే ఎయిర్ హోస్టెస్

క్యాంప్ అండమాన్
అందమైన జ్ఞాపకం

అక్కడ ఓరాత్రి
రోడ్డుమీద నడుస్తుంటే
నిశ్శబ్దాన్నిచీలుస్తూ
వినిపించిన శ్రీకాకుళంయాస
చెవినపడినప్పుడు నాఆనందం
వర్ణనాతీతం

16 .10 .2004        

sajeevam

పులి పంజా విసిరింది
కలవరపడింది ప్రభుత
పట్టుదల పెరిగింది అధినేతకి

పోలీసు యంత్రాంగం కదిలింది
ఎన్ కౌంటర్లో రక్తపుమడుగులో పులి

కనుమరుగయిందిపులి
సిద్దాంతం సజీవమే
అనుచరుల్లో సానుభూతిపరుల్లో

*కిషన్జీ ఎన్ కౌంటర్
26 .11 .2011 

Sunday, 20 November 2011

khara bharatham

ప్రపంచకప్
ధోణీ సేనకందించి
మనల్ని అజేయుల్ని చేసి
స్నేహ పూర్వకంగా నిష్క్రమించింది వికృతి

ధారావాహికాల టి.ఆర్.పీలన్నీ
దారుణంగా పడిపోయేయట
ఆంటీలందరికీ ప్రపంచకప్ రియాల్టీ షోవే
తెగ నచ్చేసిందట

జాతీయక్రీడ హాకీ
కుర్రకారు ఉర్రూతలూగేది సచిన్ఆటకి
ప్రత్యక్ష ప్రసారాలలో
యావజ్జాతి తలములకలయినా
మీడియా చర్చిస్తుంటుంది
గెలుపు ఓటములు నిర్ణయించేది
జట్టు నైపుణ్యమా బెట్ మయాజాలమా అని

టాంక్ బండ్ సాక్షిగా
కూలిన తెలుగు వెలుగులు
ఆరువందలమంది ఆత్మబలిదానాల
మాటేమిటన్న తెలంగాణావాదం
తెలంగాణా తంత్రులు
సోనియమ్మ సవరిస్తే
ప్రత్యెక రాష్ట్ర సంగీత విభావరులు
పలు ప్రాంతాల్లో

వెనుకబడిన వర్గాలకి
రిజర్వేషన్లని ఏభైలలోనే
అమలుచేసిన రాజ్యాంగం
చట్ట సభలలో మహిళా రిజర్వేషన్లని
మరో అరవైవత్సరాలకి  సైతం
చట్టబద్ధం చేయకపోవడం
మచ్చుతునక  పురుషవేతల
దురహంకారానికి
మరోసారి జన్మించి అంబేద్కర్ మహిళగా
మహిళా రిజర్వేషన్ చట్టంకోసం
చేయాలేమో అవిశ్రాంత పోరాటం

కోట్లకి పడగెత్తిన వారికి
స్కేమ్లు వేడివేడిపకోడీలు
సామాన్యుడికి సంబంధంలేని
వికీలీక్స్ స్పైసీమసాలాలు
ఇరవైనాలుగ్గంటల న్యూస్ ఛానల్స్ కి
అవేమరి విందుభోజనాలు

స్వపక్షంలోనే
ప్రతిపక్షాన్నితలదన్నేవిపక్షం
రాజకీయనాయకుల
వ్యూహప్రతివ్యుహాలు
సరికొత్త రాజకీయపుంతలు
భారతావనిలోవింతలు

నేటిభారతంలో
ఎన్నెన్ని మహాభారతాలో
వరసిద్ధి వినాయకా
జరచూడవయ్యా
ఖర భారతాన్ని కాస్తకాపాడవయ్యా

3 .4 .2011
ఉక్కుసాహితి ఉగాది కవిసమ్మేళనం      
  

khara bharatham

ప్రపంచకప్
ధోణీ సేనకందించి
మనల్ని అజేయుల్ని చేసి
స్నేహ పూర్వకంగా నిష్క్రమించింది వికృతి

ధారావాహికాల టి.ఆర్.పీలన్నీ
దారుణంగా పడిపోయేయట
ఆంటీలందరికీ ప్రపంచకప్ రియాల్టీ షోవే
తెగ నచ్చేసిందట

జాతీయక్రీడ హాకీ
కుర్రకారు ఉర్రూతలూగేది సచిన్ఆటకి
ప్రత్యక్ష ప్రసారాలలో
యావజ్జాతి తలములకలయినా
మీడియా చర్చిస్తుంటుంది
గెలుపు ఓటములు నిర్ణయించేది
జట్టు నైపుణ్యమా బెట్ మయాజాలమా అని 
  

Saturday, 19 November 2011

putrikotsham

పుత్రిక
విలువైన ఆస్తి
అపురూపమైన కానుక

అపుత్రస్య గతిర్నాస్తి అలనాటి నానుడి
నేటి తనూజ ఆత్మీయత అనురాగం
తల్లితండ్రులకు పంచి
తరింపచేస్తోంది వారిజన్మ

కుంచమంత కూతురుంటే
మంచందగ్గరకే కంచమట
ఆడపిల్ల  `ఆడ`పిల్లయినా
మనసంతా ఈడేనట  

కూతురు మన ఇంటి మహలక్ష్మి
మెట్టినింట గృహలక్ష్మి
అన్నదమ్ముల శ్రేయస్సు
అభిలషించే రక్తబంధం
రక్షా బంధనాన్ని బంధించే తోబుట్టువు

మనసున్న మనుషులకి
మమతలెరిగిన మనసులకి
పుత్రిక విలువ తెలిసింది నేడు 

కూతురిచ్చే వెలుగు
కుటుంబానికే వెలుగు
కూతురు విద్యవంతురాలయితే
కుటుంబం యావత్తూ
పొందుతుంది విద్యాగంధం

నేడు పుత్రికల దినోత్సవం
పుత్రికోత్సవం
గర్విద్దాం మనం పుత్రికలమైనందుకు
పుత్రికోత్సహాన్ని జనులీపుత్రికలని
ప్రశంసించినపుడు కలిగిద్దాం
తల్లితండ్రులకు

*on the occasion of daughters`day 

Friday, 18 November 2011

nishkalamka neta

జాతిరత్నాల నడుమ
మసిబారి పోయేవో

జాతిపిత జయంతి వెలుగులో
నీ జయంతి క్రీనీడయ్యిందో

విషమ స్థితిలోఆదుకున్నావు జాతిని
పిట్టమనిషివైనా పిడుగులుకురిపించేవు

జైజవాన్ జైకిసానని
జాతిని ఉత్తేజపరిచావు

అన్నదాతను అందలమెక్కించావు
సరిహద్దులు సంరక్షించే
వీర జవాన్లకై నీఎద పరిచేవు

సాదాసీదా జీవితం నీది
మహోన్నతం నీవ్యక్తిత్వం
పొట్టివాడు బహు గట్టివాడన్నారందరూ

మాయదారి జబ్బు నిన్ను మాయం చేసిందో
మనుషులే మాయ చేసేరో
ఆకస్మిక మరణం పరాయిదేశంలో

జోతలివే మానిష్కళంకనేతకి
శాస్త్రీజీకి

19 .11 .2011

Wednesday, 16 November 2011

pramaadaalu pramaadaalu

ప్రమాదాలు ప్రమాదాలు
అయ్యో చిన్నారులు

బడిలో తారవై మెరిసేవు
 రోడ్డుమీద రక్తసిక్తమయ్యేవు

బీచ్లో స్నేహంలో తడిసింది
రాకాసి మృత్యువు కెరటమై నోట కరచింది

కుక్కకాటు వాతపడ్డ పసివాడు
బిడ్డకోసంకడుపు చెరువైన కన్నతల్లి

ప్రమాదం అంటే భయం
ప్రమాదం తెలుసుకుంటే భయం

చిన్నక్కా నువ్వన్న క్షేమమే
తెలుసుకుందాం అందరినుండి

17 .11.2011
అక్కకవిత చదివి వెనువెంటనే 

ashavaadam

శిశిరం వెనుకే వసంతం
లోయల వెనుకే శిఖరం
చీకట్లు మింగే ఉదయం

రుతుధర్మం కాలగమనం
ప్రకృతితత్త్వం తెలుసుకుందాం
 ఆశావాదులమై అడుగు ముందుకేద్దాం

16 .11 .2011

Tuesday, 15 November 2011

alati alati padaalu

అలతి అలతి తెలుగు పదాలు
కావాలి నాకు
లలిత లాలిత్య పదాల వెలుగు
 కావాలి నాకు

పూర్ణ బిందువు మంత్ర స్వరమట
విసర్గ శివశక్తి రూపమట
విసర్గను సంస్కృతానికి విడిచిపెట్టి
 పూర్ణ బిందువు స్వీకరించా

అపుడు
కమనీయం
రమణీయం
 కవితాస్వరూపం

16 .11 .2011 

varamulosagiri velupulu

విరించి వరమిచ్చాడు
అర్ధ శతం పూర్తిచేస్తావని

శంకరుడు వరమిచ్చాడు
అర్ధ నారీశ్వరం ఎటువేపైనా
డాక్టర్ వి నువ్వని

వాగ్దేవి వరమిచ్చింది
డాక్టరమ్మకి అమ్మవిలే నువ్వని

సిరి కరుణించింది
మూడు బంగారాలు నీ సొంతమని

పార్వతి కటాక్షించింది    
తన తనయులు నాకు అన్నదమ్ములని

త్రిశక్తులువరమిచ్చారు
 అక్కలు నీకు అమ్మలేనని

అది దంపతులు వరమిచ్చారు
మేమే నీకు అమ్మానాన్నలమని
అత్తమామలమని

15 .11 .2011  

Monday, 14 November 2011

hamee iddaam

విరోధినుండి
వికృతిలోగా

ఓచిర పరిచిత నవ్వు
రాలిపోయింది
నమస్తే అక్కయ్యా నమస్తే చెల్లెమ్మా
నమస్తే అన్నయ్యా నమస్తే తమ్ముడూ -అంటూ
సందడి చేసే ఆ నవ్వులరేడు
తొందరపడి ముందే సెలవుతీసుకున్నాడు

కృష్ణమ్మ తుంగభద్రలు
ఉప్పొంగితే - ఉప్పెనే
ప్రజల జీవితాల్లో
వరద మోసుకొచ్చిన
రాజకీయ బురద
ఇంకా వదిలించుకోలేని ప్రభుత

మహిళా బిల్లు
పురుషాహంకారాల నడుమ
కొట్టుమిట్టాడుతోంది

నానాటికీ వేడెక్కుతున్న ధరిత్రి
అంతకు మించి వేడెక్కుతున్న
రాష్ట్ర రాజకీయాలు

తెలంగానం - బృందగానమయింది
అన్నదమ్ముల నడుమ
అభివృద్ది గణాంకాలు
అవసరమయ్యేయి

జగన్నాటక సూత్రధారి
రంగ ప్రవేశం  రాష్ట్రంలో
జగన్నాధ రధచక్రాల గమనం - మరెటో

రాష్ట్రచీలిక అనివార్యమైనా
తల్లి అవిభాజ్యం
తేనెలొలుకు తెలుగు ప్రగతికి
హామీ ఇద్దాం - బిడ్డలందరం

2010 ,ఉగాది కవిసమ్మేళనం 







 

erupu

ఎరుపు కమ్యూనిజం
ఎరుపు మార్క్సిజం
ఎరుపు గురువమ్మ సంతకం

ఎరుపు సాహసం
ఎరుపు జనంబలం
ఎరుపంటే భయంభయం

ఎరుపు ఉదయం
ఎరుపు అస్తమయం
ఎరుపు సహస్రదళపద్మం

ఎరుపు కంటిజీర
ఎరుపు ముక్కంటిచూపు 
ఎర్రసిరా మావృత్తికాధారం

27 .2 .2006 

ayomaya sarwajit

పేరుకి శాశ్వత సభ
గతం అశాశ్వితం
భవిత ప్రశ్నార్ధకం
నేడది నూతన శిశువు
ప్రాణం పోసేది ఆయువు తీసేది
అధికారపక్షాలు

మృత భాషలో మార్కులపంట
తెలుగు నోట దొరలభాష
తెలుగునాట నిర్జీవమవుతున్నమాతృభాష

పవిత్ర వృత్తివిద్యాకళాశాలలలో
పైశాచిక ర్యాగింగులు
ఆత్మహత్యతో  అంతమయ్యే
అన్నదాతల బతుకులు

అర్ధనారీశ్వరత్వం ఆవిష్కరించినా
ఆ పరమశివుడు-
చట్టసభలలో మహిళా రిజర్వేషన్
అమలుకి తావివ్వని రాజకీయపక్షాలు
ఆడశిశువు జన్మించే హక్కు సైతం
కాలరాసే భ్రూణహత్యలు

తెలుగునాట
వేరు కుంపట్లు ప్రాంతీయవాదాలు
రాష్ట్రాన్ని తెలుగు తమ్ముళ్ళు
వాటాలేసుకున్నా
తెలుగుసంస్కృతిని త్రివేణీ సంగమంగా
పదిల పరుచుకుంటూ మెరుగుపరిస్తే
అదే పదివేలు

అయోమయంతో అడుగిడుతున్నసర్వజిత్
 స్థిర విజయాలనే సాధిస్తుందని ఆశిద్దాం

18 .3 .2007 
ఉక్కుసాహితి ఉగాది కవిసమ్మేళనం 


  

Sunday, 13 November 2011

virodham vaddu, virodhee....

కరెంటు ఉచితం
కలర్ టీవీ ఉచితం
సెల్ ఫోన్ ఉచితం
అయాచితంగా వచ్చిపడిన  పేదరికానికి
అన్నీ ఉచితమే ఎన్నికల సమయంలో

కార్పొరేట్ కాలేజీల
అమ్మకపు సరుకు
అమ్మానాన్నల సుందర స్వప్నం
యువతీయువకుల డాలర్ డ్రీమ్స్
అన్నీ కొట్టుకుపోతున్నాయి
ఆర్ధిక మాంద్యంలో
చిద్రమౌతున్నాయి మానవ సంబంధాలు

సత్యం మిథ్యగా మారినవేళ
సత్యాన్ని తిరగేసి
తలరాతలు తిరగరాసినవేళ
వాపాబలుపా మీమాంసకి సమాధానం
సాఫ్ట్ వేర్ సంక్షోభం

యత్ర నార్యన్తు పూజ్యతే
తత్ర దేవతా రమంతే
వేదభూమిలో
అతివలను వెంట తరిమిన
హిందూతాలిబాన్లు
సంస్కృతి దిగజారుతోందంటూ
మరింత దిగజారుతున్న కుసంస్కారులు

తాజ్ లో పేలిన తూటాలకి
 ఉగ్రవాదచర్యలకి
ప్రేమోన్మాద ఏసిడ్ దాడులకి
ఆధార భూతమయ్యింది
సర్వధారి వీటన్నిటికీ

అజ్ఞాన తిమిరాన్ని అధిగమిస్తూ
విరోధిద్దాం విరోధిలోనైనా
అమాయకత్వంతో పేదరికంతో
వాగ్దానాల వ్యపారంచేసే
తుచ్ఛ రాజకీయాల్ని

విరోధిద్దాం పైశాచిక చర్యలూ
పాశవిక దాడులూ
అణిచివేత -దోపిడీ

విరోధిలో విరోధం వద్దు
సమైక్యతే ముద్దు ఎప్పటికీ.....

21 .3 .2009
ఉక్కుసాహితి ఉగాది కవిసమ్మేళనం



samaikyamayyam

అత్యాచారాలూ బలవన్మరణాలూ
అంతిమ గడియ వరకూ
పెనుగులాట -పోరాటం
అతివ చరిత సమస్తం
పరపీడన పరాయణత్వం
రక్తసిక్తం

ఎందరో స్వప్నికలు-ఆయేషాలు
మైనరు బాలికలపై అత్యాచారాలు
సాముహిక అత్యాచారాలు
ప్రేమ పేరుతో తెగనరికే
ప్రేమోన్మాదులు -ఏసిడ్ దాడులు
గడప దాటితే చాలు
వేధింపులు వేటకుక్కలు

అన్ని చానళ్ళకు ఇరవైనాలుగ్గంటలపాటు
సంచలన వార్తవౌతావు
కన్నవారి గుండె బద్దలు చేసే
బ్రేకింగ్ న్యూస్ వౌతావు
ఏబీచ్ లోనో శవంగా కొట్టుకొస్తావు
ఒంటిమీద కత్తిపోట్లతో
ఇంట్లోనే ఎదురౌతావు

కధానాయికవైనా
బుల్లితెర మెరుపువైనా -మైమరుపువైనా
అర్ధరాత్రి కాల్ సెంటర్లో డ్యూటీ దిగినా
పట్టపగలు ప్రేమికుని కలిసేందుకు ఆటో ఎక్కినా
భయంకర మరణం నీ గమ్యస్థానం
కాకుంటే అమానుష అత్యచారపర్వం

బతికున్న దెయ్యాలూ పిశాచాలూ
మృత్యువు వరకూ నిన్ను తరుముతాయి
మృత్యువు కోరల్లో నువ్వొంటరి వయినా
కోటి గొంతులతో ఈఅన్యాయన్నీ
దౌర్ర్జన్యానీ ప్రశ్నించడానికి
మేం సమైక్యమయ్యాం

మరో స్వప్నిక-అయేషా
దుర్మరణం పాలుకాని
సమాజాన్ని మేం స్వప్నిస్తున్నాం

మే2009,భూమిక
    

Saturday, 12 November 2011

taj

కళల రేడు షాజహాన్
సుందర స్వప్నం తాజ్
చలువరాతి కనువిందుతో
 పసందైనతాజ్

వెన్నెల సొగసులు
కానల పాల్గానీక
తన సొంతం చేసుకునే
వగలమారి తాజ్

నల్లని యమునకు
చల్లని చెలిగా జతచేరిన
తెల్లని పాలవెల్లి తాజ్

మండుటెండలో
 జిగేల్మని మెరిసిపోతూ
మిడిసిపడే తాజ్

అంగాంగం లో
ఇంకిన శ్రమజీవుల స్వేదంతో
స్వచ్ఛమై  శాశ్వతమై నిలిచిన తాజ్

అచేతనావస్థ -అజరామర ప్రేమ
అవలోకించే అశేష జనవాహిని

మధ్య యుగపు
మహాద్భుతంతాజ్
మన సాంస్కృతిక వారసత్వ సంపద తాజ్

29 .1 .2001
*చమట చలువను చేర్చి
చలువ రాతిని తీర్చిన
లక్షలాదిమంది శ్రామికులకే  

swedam

పది రూపాయలకు
ఐదు కలాల నమ్మితే
నీకేం మిగిలిందయ్యా
అర్ధరూపాయి జీవనోపాధి తప్ప

పదిరూపాయలకు
అరడజను టైలరింగ్ సామగ్రినమ్మితే
నీకేం మిగిలిందయ్యా
అర్ధాకలి బతుకుతప్ప

రెండు రూపాయలకు
కేజీ టమాటాలమ్మితే
నీకేం మిగిలిందయ్యా
వీసెడు స్వేదంతప్ప

29 .1 .2001
*రైలాగిన అరనిముషంలో
 తమ వ్యాపారం చేసుకునే
చోటాబిజినెస్  వాలాలకు  

Friday, 11 November 2011

ashaa pardhivam

చిదిమిన పాల్గారు
చిన్నారి మొగ్గలు త్రుటిలో మసిబొగ్గులుగా
మార్చిన కుంభకోణం అగ్నిప్రమాదం

ఆనాడు శుష్కమై గాలిలో కలిసిన
పసికూనల ఆర్తనాదాలు
ఈనాటికీ నాచెవిలో గింగురుమంటున్నాయి

కసిమొగ్గలుగానే మసిబారిపోతే
ఆ కన్నతల్లుల కడుపుకోత
మనకంట మారింది కన్నీటి సంద్రంగా

క్షమించరాని నేరం
భరించలేని ఘోరం జరిగిపోయింది
మధ్యాన్న భోజనం మృత్యువుగా మారింది

తారణ ఉగాదికి స్వాగతంపలికాం
మంగల తోరణాలతో
కానీ మనకేం తెలుసు
కొంగు చాటున సునామీ రక్కసిని
కొన్నినెలల పాటు దాచేస్తుందని
మనం ఏమరపాటుగా ఉన్నప్పుడు
అది మీదపడి దాడి చేస్తుందని
రాకాసి అలగా విరుచుకు పడుతుందని

తారణం మోసుకొచ్చిన
సునామీవిషాదం ఎన్నివేల కుటుంబాలలోనో-

సానియా మిర్జా సాధించిన విజయాలు 
తెలుగు జాతికి తీపి గురుతులు మిగిల్చినా
తారణం నడకంతా చాప కింద నీరులా
వేప పూవెక్కువైన ఉగాదిపచ్చడిలా
చేదు అనుభవాల గురుతుగా మిగిలింది

రాజకీయ రహస్యమో -మఠంలో కావేషమో
జనం మెచ్చని-మాయని మచ్చ -కంచి కధ
కంచికో కోర్టుకో తేల్చాల్సినది పార్ధివం

కాలం -చేసిన గాయాలను
 మాన్పుతుంది మరుపు మందువేసి
నడిపిస్తుంది మునుముందుకి
అందుకే ఆశావాదంతో అడుగు ముందుకేద్దాం
స్వాగతం పలుకుదాం పార్థివ ఉగాదికి

ఉక్కు సాహితి ఉగాది కవిసమ్మేళనం 

Thursday, 10 November 2011

ennikala tharanam

మహిళలకి చట్ట సభలలో 
మూడోవంతు సీట్లు కేటాయించకుండానే 
ఎన్నికలొచ్చేసాయి

యువతకి బీదాబిక్కికి
ఉపాధికల్పన లేకుండానే 
ఎన్నికలొచ్చేసాయి  

ప్రపంచ బ్యాంకు రుణాలు 
తీర్చాల్సినది ఎన్నితరాల భారతీయులో
తేలకుండానే ఎన్నిక లొచ్చేసాయి 

సరళీకరణ -ప్రపంచీకరణ -
ప్రైవేటీకరణ విధానాలతో 
లాభపడ్డది అభివృద్ధి చెందిన దేశాలో 
సగటు భారతీయుడో-
నిరుపేద కార్మికుడో-కర్శకుడో 
తేలకుండానే ఎన్నిక లొచ్చేసాయి

సూడో  సెక్యులరిజాలూ
స్టాంపుల కుంభకోణాలూ
ఏవీ ఓ కొలిక్కి రాకుండానే
ఎన్నికలొచ్చేసాయి

కాషాయం చదువునీ సంస్కృతినీ
కాషాయీకరిస్తుందో
హస్తం అధికారం హస్తగతమయ్యాక
రిక్త హస్తమే చూపిస్తుందో

రాష్ట్ర ఆర్ధిక సాంఘిక 
ద్విచక్రాలకి పంక్చర్లే పడతాయో 
ఏదీతెలియని అయోమయంలోకి 
జనతని నెట్టేసి ఎన్నికలొచ్చేసాయి

తారణ ఉగాది
ఉగాది పచ్చడి కసింత చేదయినా
తెలుగుతనమంత కమ్మగా ఉంటుంది 
సగటు మనిషి బతుకు 
కటిక చేదు కాకుంటే అంతే చాలు 

ఎన్నికల -గ్రీష్మ -తాపాలతోవేడెక్కుతున్న 
భరతభూమి మేలైన నాయకుల 
ఎన్నికతో చల్లబడితే అంతేచాలు 

ఉక్కుసాహితి ఉగాది కవిసమ్మేళనం
18 .3 .2004













Wednesday, 9 November 2011

premageetam

చూపులు కలిసిన శుభతరుణంలో 
అంకురించెలే నీపై ప్రేమ 

మనసులు కలిసిన మధుర క్షణాలలో 
మొగ్గ తొడిగెను మనప్రేమ

నలుగురిలో నేనున్నా 
నా తలపులలో నువ్వేలే

ఏకాంతం నాదైనా
మదినిండా నీవేలే 

ప్రేమ పరితప్త హృదయం నాది 
అమృత కలశం అందించవోయి 

17 .4 .2002 

varsham

రాత్రంతా ఏనీలిమేఘాన్ని 
ప్రకృతి తన గుండెపై మోసిందో 
తెలతెల వారుతుండగా 
కన్నీరై కురిసిందో 

ఏసంతసాన్నిఎదలోన దాచిందో 
ఆనందభాష్పమై జాలువారిందో

ఆకుమీద ఒక చప్పుడుగా 
రేకు మీద ఒక చప్పుడుగా 
నీటిబొట్టుకై తపిస్తున్న 
మట్టితోకలిసి పరిమళంగా.....

7 .2 .2000

meemaamsa

సర్వజిత్ మీమాంసలు 
సర్వధారి సమాధానాలు 

మాయావతితో మంతనాలు 
చంద్రబాబు తో చెట్టపట్టాలు 
తమ్ముడు వాయువేగం 
బామ్మర్ది మనోవేగం 
మెగాస్టార్ మౌనానికి మరి కారణం 

అధికార ప్రతిపక్షాలకి 
సొంత గూళ్ళలో ఎదురు దెబ్బలు 
రిలీజ్ కాని బొమ్మకి పబ్లిసిటీ ఆర్భాటం 
రాష్ట్ర రాజకీయాల్లో చిరుగాలే పెను తుఫానా 
సర్వధారి సమాధానానికెదురు చూద్దాం

సర్వజిత్ లో పరాకాష్ట కి 
చేరుతుందనుకున్న తెలంగానం 
సర్వధారి వరకూ రావణ కాష్టమే 
తెరాస రాజీనామా రాజకీయాలు 
మౌనం వీడని madam 
ఏఉగాది తెలంగానానికి తెర ఎత్తనుందో 
తెలంగాణ వాదానికి తేరా దించనుందో
తెలంగాణమా-సమైక్యంధ్రమా -అదే మీమాంస 
సర్వధారి సమాధానానికెదురుచూద్దాం

మధ్యంతరం తధ్యమన్న 
పతాక శీర్షికలు 
వార్షిక బడ్జెట్ లో వరాల  వెల్లువ 
అప్పుడే ఎన్నికలా 
అవాక్కైనజనం 
సర్వధారిలో సైతం వేలాడుతున్న 
డమక్లేస్ ఖడ్గం 
మధ్యంతరమా -సాధారణమా
సర్వధారిలో సమాధానానికెదురుచూద్దాం 

వందకి చేరుకున్న వంటనూనె 
కొందామన్నాదొరకని కూరగాయలు 
కొండెక్కి కూర్చున్న వెచ్చాల ధరలు 
మీమాంసకి  తావులేని ఆర్ధిక అవస్థలు 
ఉగాదినాడు ఉగాది పచ్చడే విందుభోజనం 
నిత్యం ఛస్తూ బతికేవారికి 
నవ్వుల టానిక్ -నేటి రాజకీయాలే

ఉక్కుసహితి ఉగాది కవిసమ్మేళనం ,2008
  

swaagatam

నీటిని చీల్చుకొని 
సముద్రంలో సముద్రంలో సాగిన జల ఉషలా 
జీవితాలను చీలుస్తూ 
సాగిపోయింది వృష 

నరనరాల్లో ప్రాణభీతి నింపిన 
గోద్రా మారణహోమం 
రావణ కాష్టమై రగులుతున్న మత విద్వేషం 

మైనార్టీల భయోద్వేగాల నడుమ 
అయోధ్యలో నాటకీయ శిలాదానం
పాశవిక హత్యలు దుర్మరణాలతో
మరింత ఎర్రబడ్డ మంచు లోయలు 

గోపురాలమీంచి కూలి రాలి పోతున్న 
తాజమహల్ పావురాలు 
ఉదయించకనే అస్తమిస్తున్న ప్రత్యూషలు 
కరెంటు షాకులతో కకావికలవుతున్న రైతన్నలు 

విద్యార్ధుల మస్తిష్కం నుంచి 
అంతరిస్తున్న కైబర్ కనుమలు 
ఆవిష్కరించబడుతున్న సైబర్ కేఫ్ లు 

అడుగడుగునా సుడిగుండాలే
అయినా -జన చైతన్యం 
నవోదయానికి నాంది

అందుకే ఆవాహన చేద్దాం 
తమస్సును సంహరించే 
కోటి ప్రభల రవితేజాన్ని 
సాదరంగా స్వాగతమిద్దాం 
నవ చైతన్య చిత్ర భానూదయలకి 


ఉక్కు సాహితి  ఉగాది కవిసమ్మేళనం,2002 



4 .4 .2002   

leekayina prashna pathram

హరితానికి కొరత వచ్చిన 
కరువు కాలంలో 
కోకిల కుజితాలూ లేవు 
ఆమని సోయగాలూ  లేవు 

జాతీయమృగం  చర్మం ఒలిచి 
గజరాజు దంతసిరులకై భీభత్సంగా తెగనరికి 
సొమ్ముచేసుకునే వేటగాళ్ళ-మంత్రివర్యుల విందులకి
కరుసయిపోయి కనుమరుగైన 
మయూరాల నాట్యాలూ లేవు 

ప్రకంపాల చేదుఅనుభవాలు 
చవిచూసిన జాతికి వేప్పువ్వు  వగరు విసుగెత్తింది

వృషనామ వత్సర ఆంధ్రభారతంలో 
ప్రపంచ బ్యాంకు షరతులతో కూడిన అప్పులు 
పప్పుకూడయితే
ఉప్పుధరకూడా ఊపందుకుంటుంది 
హై టెక్ మహా మంత్రం చీకట్లో జపించడమే
మనకిక మిగిలింది 

గణతంత్ర దినోత్సవాలలో మిరుమిట్లు గొలిపిన 
రక్షణ రవితేజానికి భక్షణ లాలూచీగ్రహణం 
తెహెల్కా వెలుగులో 
అధికార యంత్రాంగ అవినీతి కుంభకోణం 
నేటి పంచాంగశ్రవణం 
ముందేలీకైన ప్రశ్నపత్రం

ఉక్కుసాహితి ఉగాది కవి సమ్మేళనం   

Tuesday, 8 November 2011

MARCHING TOWARDS DESTINATION

I am a soldier
With a pen in my hand
And a zeal to inspire humanity

I am a soldier
On a mission to awaken masses
To a world free of exploitation

I am a soldier
Carrying revolutionary ideas
Raising the slogans Liberty and Equality

I am a soldier
In the path of martyrs
Dreaming a socialist world of equals

I am a soldier leading Half the sky
To a better society with dignity

I am a soldier
Holding the candle of hope
Marching towards destination

1 .2 .1999  

pumbhavasaraswathi

తత్త్వంలో  సోక్రటిస్ ని   
సరళత్వం లో గాంధేయాన్ని

నిశ్చలత్వంలో బౌద్ధాన్ని
బోధనలో రాధాకృష్ణుని 

వర్చస్సు లో సూర్య తేజస్సుని
సూరమ్మ తో జీవితాన్ని 
కలబోసుకున్న పుంభావసరస్వతి కి 
వందనములు

19 .12 .1999

pumbhava saraswathi

తత్వం లో సోక్రటీస్
సరళత్వంలో గాంధేయం
నిశ్చలత్వంలోబౌ

sahasrabdi

విప్లవాల సహస్రాబ్ది
స్వేచ్ఛా సమానత్వాలకిది పునాది
నిరంకుశత్వాన్నెదిరించి  
బాస్టిల్ లో  ఘన విజయం సాధించి 
విజయబాపుటా ఎగరేసిన  ఫ్రెంచివిప్లవం 

రాచరికాన్ని పరిమితం చేసి 
ప్రజాస్వామ్యానికి పట్టంకట్టిన 
రక్తరహిత విప్లవం

ప్రాతినిధ్యం లేనిదే పన్నుకట్టమని 
సామ్రాట్టునే సవాలుచేసి 
స్వేచ్చాదుందుభి మోగించి 
వలసపాలన అంతం చేసిన అమెరికన్ల పోరాటం 

పనిహక్కును విద్యాహక్కును కల్పించి
సమసమాజానికి రాచబాటైన
రష్యన్ విప్లవం 

ధనికస్వామ్య కోరలనుండి
పేదరైతుల చెర విడిపించి 
సుదీర్ఘయాత్రలోఅమరులైన 
చైనావీరుల ప్రజావిప్లవం 

మండే ప్రతి హృదయం విప్లవమై 
పలికే ప్రతిమాటా ఆయుధమై 
విప్లవాల సహస్రాబ్ది 
సామ్యవాద నవశకానికి నాంది

డిసెంబర్ ,1999


sahasrabdi


kastam

ఎంత కష్టం ఎంత కష్టం 
వారంలోఆరు రోజులు
 బడికి బస్తా మోయాలంటే ఎంత కష్టం 

కళ్ళని నిద్దర బంధిస్తుంటే
లేలెమ్మని నిర్బంధిస్తే
ఎంత కష్టం 

మనసు తీరా ఆడకుండానే 
 పుస్తకం తీయమని పెద్దరికం చూపితే 
ఎంత కష్టం 

ఆకలాకలని కేకలు పెడితే 
చదువు సంగతి ముందంటూ 
హోమ్ వర్క్ చేయమంటూ 
వాయిదాలు వేస్తే ఎంత కష్టం 

అమ్మ మీదపడి 
ముద్దుల వర్షం కురిపిస్తే 
ఆటలు సాగవని విసుక్కుంటే
ఎంత కష్టం 

1 .2 .2000  

kavitha

కవిత నా రూపం 
కవిత నా ప్రాయం  

కవిత నా నేస్తం 
కవిత నా ధ్యానం 

కవిత నా భాష 
కవిత నా శ్వాస 

కవిత నా హృదయం 
కవిత నా ఆయుధం 

కవిత నా జీవితం 
నా హృదయం కవితామయం 

Monday, 7 November 2011

sarat chandrudu

శరద్రాత్రులలో
పున్నమిచంద్రుడు 

దూదిబంతిలా
మల్లెచెండులా
వెన్నముద్దలా

వెన్నెల కురిపిస్తూ 
మైమరిపిస్తూ 
మెరిసిపోతూ ....

21 .12 .1999

prapamcha sundari

దీనుల కోసం 
చరిత్ర హీనులకోసం 
తన బతుకు కరిగించే 
ప్రతినారీ ప్రపంచ సుందరి 

ప్రతికూల పరిస్థితులపై
పోరాటం కొనసాగిస్తూ 
ఏటికి ఎదురీదే 
ప్రతి మహిళా 
ప్రపంచ సుందరి 

దురాచారాల దుష్టశక్తుల 
కొమ్ములు వంచే 
ప్రతి సబలా ప్రపంచ సుందరి 

ప్రజల మనిషిగా పోరుబాటలో 
ముందుకు సాగే 
ప్రతి వనితా ప్రపంచ సుందరి 
20 .12 .1999 

motherly teacher

Teacher
The Mother in School
Mother
The Teacher at Home

Teacher loves her students
Mother trains her children
Teacher moulds  the character
Mother gives worldly knowledge

Teacher shows motherly affection
Mother gives masterly guidance
Indiscipline of the child worries them both
Success-makes them proud

Child
The pet of two lovable mothers
Student
The FAN of two great teachers
The baby bud enjoys
care and nurture of
Both the Gardners

vyaya aadaayaalu

సోనియా ఐడియా 
జాతి జీవనాన్నే మార్చివేస్తుంది 
కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు 
ఏపధకాలు చేపట్టినా 
క్రీనీడలా వెన్నంటి వుంటుంది 
ప్రపంచ బ్యాంక్ నెట్ వర్క్ 

అసెంబ్లీలో ఆవేశాకావేశ ప్రసంగాలు 
కడుపుకి అన్నమా -చేతికి గాజులా-
వ్యర్ధప్రశ్నలు 
హత్యాకాండల సత్యాలను 
బట్టబయలు చేస్తున్న చట్టసభలు 

దేశభాషలందు తెలుగు లెస్స 
తెలుగునాట తెలుగు లేస్సే 
దేశంలో తెలుగుమాటదే రెండో స్థానం 
ఏవాశి బలమూ -ఏ రాశి ఫలమూ 
కల్పించలేని ప్రాచీనత 

అదేమీ దుర్గతో-మరేమిసంగతో 
తెలుగు ప్రాచీనతకి కరువైన ప్రాపకం 
కమిటీ కూటాల కుమ్ములాటలు కావు 
కలంతో కలకలం రేపే 
కవుల గళాలు గర్జించాలి 

రాజకీయ నాయకుల నీచభాషతో
చవకబారు సినీభాషతో 
తెలుగు పతనమయ్యేకన్న 
మమ్మీ డాడీ అన్నా
ఆంగ్లంతో పెనవేసుకున్నా   
సంస్కారంతో కూడిన భాషే మిన్న 

సున్నా బూచితో బెదిరించి 
ప్రాణాలు తీసే కీచకాచార్యులు ఎందరెందరో
అమ్మాయిల బతుకునీ భవితనీ
కాటువేసే విష-మగ-నాగులెన్నో 

అందుకే అచ్చ తెనుగు అక్షరాలు
తమని దర్పణంగా మార్చి 
అద్దం  పట్టమంటాయి 
రాజకీయ అరాచకాన్నీ
సమాజంలో పైశాచికత్వాన్నీ  

పార్ధివపరిస్థితి 
ఈ దుస్థితిలో ఉంటే
వ్యయ వత్సరంలో ఎన్ని ప్రయాసలో 
అయినా సంధిద్దాం
పదునెక్కిన మన అక్షర బాణాల్ని 
సాధిద్దాం వ్యయ వత్సరంలో 
విజయాల ఆదాయాల్ని 

25 .3. 2006 
ఉక్కుసాహితి కవిసమ్మేళనం

maavi

స్టీల్ సిటీ నుండి 
విశాఖ సిటీ వరకు ఆ హైవే 
అంతా నాకిష్టం 
మరీ రద్దీలేని హైవే

హరితం 
చెట్లు కొండలు
 ఎన్ .ఎ .డి పైనుంచి చూస్తే
వయ్యారంగా నడుం వాల్చిన 
అందమైన అమ్మాయిలా 
హొయలు కురిపిస్తూ 
అద్భుతంగా దర్శనమిచ్చే
సింహాచలం కొండ 
ఎన్నిసార్లు చూసినా
మరింత అందంగా 

ఆ హై వే స్టీల్ సిటీకి 
సిటీకి వారధి 
ఒక ప్రశాంత వాతావరణానికి 
బిజీ సెంటర్ కి  వారధి 

ఎందరో విద్యార్ధులని ఉద్యోగులని 
మోసుకు తిరిగే బస్సులు 
జంటలతో కళ కళలాడే 
ద్విచక్ర వాహనాలు 
బళ్లమీదే ఆదమరిచి
 నిద్దరోయే పిల్లలు 

ఈ రాజమార్గం మాది 
మేం గర్వించే 
విశాఖ సోయగాలన్నీ
అచ్చంగా మావే 
1. 10 . 2005 ,.మెయిల్   

Sunday, 6 November 2011

kanche

భయంకర దృశ్యాలు 
మృత్యువుకు చేరువౌతూ  
బచావ్ బచావ్ అంటూ చేసే 
అస్పష్ట ఆర్తనాదాలు 

నిన్న నింగిని చుంబించిన ఆకాశ హర్మ్యాలు 
నేడవి కుప్పకూలిన పేకమేడలు 
చిన్నాభిన్న మృత దేహాలు 
చెదిరిన కుటుంబాలు 
ఆప్తుల ఆక్రందనలు 

ఆర్భాట గృహప్రవేశాలు 
వ్యర్ధమైన వేదమంత్రాలు 
గుమ్మంలో వేలాడేసిన గుమ్మడికాయ 
ధ్వంసమైన హ్యుమన్ బాంబ్ లా 
ఆత్మాహుతి చేసుకుంది 
స్వజనాన్నే  పొట్టనపెట్టుకున్న ఇల్లు 
నిరపరాధినంటూ క్షమాభిక్ష కోరింది 
9 .2 .2001 ,వార్త       

concern

గంటల గడియారానికి పరదా వేస్తావ్ 
నాకు నిద్రాభంగం కారాదని 
వెలుతురు తొంగి చూడకుండా 
తలుపులన్నీ బిగిస్తావ్ 
పిల్లిఅడుగులు వేసుకు నడుస్తావ్ 
పిల్లలకి హుష్ హుష్షని
సైగలు చేస్తావ్ 

బంగరునిద్రని నాకు 
కానుకగా ఇవ్వడానికి 
శతవిధాల యత్నిస్తావ్ 

కన్నతల్లిలా సాకేగుణం నీకుండగా 
పసిపాపనికానా నీగృహసీమనేలినా    

pancharatnalu

త్రిశక్తులే తనయలై 
తరలివచ్చారు మీదరికి 

పెద్దచెవులగణపయ్య 
అరివీర భయంకరుడామురుగన్ 
మీఇంటి సల్మాన్ 

రామలక్ష్మణుల అండదండల దశరధులా
బలరామకృష్ణుల నందులా 
విఘ్నదేవుని ఇంటి భోళాశంకరులా మీరు 

కూతుర్ల ముచ్చట
తీరలేదని తనయలే అయినారు 
మీఇంటి కోడళ్ళు 
కొడుకుల ముచ్చట తీర్చడానికి 
తనయులైనారు అల్లుళ్ళు 

ఎలా లెక్కించినా పంచరత్నాలే
మీ ఇంటి ఘనులు-మీ కంటి సిరులు 
అభినందనలు మీకు 
అమ్మానాన్నలకు 
     

prema varadai varamai.....

సహనం సహకారం 
సమర్ధత సౌశీల్యం 
దయార్దహృదయం సహాయగుణం
ఇన్నిటి సమ్మేళనం అది నువ్వు 

సాహచర్యం నీతో 
సహగమనం నీతో
సావాసంనీతో సహవాసంనీతో 
వసంతాలు నీతో 
శరద్రాత్రులు నీతో 
వెన్నెలహాయి నీతో 

చిన్నారుల సిరులు నీతో 
చిరునవ్వుల హొయలు నీతో 
చిదానంద చిత్తం నీతో 

మల్లెలు మరువాలు నీతో 
జాజులు విరజాజులు నీతో 
సంపెంగలు సౌరభాలు నీతో 
గులాబీలు గుబాళింపులు నీతో 

వెలుగురేఖల తొలిపొద్దు నీతో 
సాయంసంజల సోయగాలు నీతో 

ప్రేమ వరదై వరమై వస్తే అదినువ్వు
అభిమానం-అనురాగం 
ఆత్మీయత-అపురూపం 
అన్నీ కలగలిసి అది నువ్వు 

chirunavvula deepavali

నీ తొలిఅడుగు
 మా ఇంటే  దీపావళీ 
నీ తొలి వెలుగులు 
మా కనులలో దీపావళీ 

చిరునవ్వు చిచ్చుబుడ్డ్లు
చిన్నారుల అల్లరులు 
కన్నుల మతాబులు 
జోకుల టపాసులు 
తుళ్ళింతల కవ్వింతల కేరింతల 
కాకరొత్తులు
వెన్నముద్దల వెలుగులు 
నవ్వుదొంతరల వెల్లువలు 

కబుర్ల తోరణాలు 
ముచ్చట్ల ముత్యాల వెలుగులు 
ముద్దుమురిపాల పాలకోవా 
ప్రమోదాల ప్రమిదలు 

అన్నీమోసుకు వస్తుంది 
చిన్నమ్మాయి
అన్నీ అమరుస్తుంది 
పెద్దమ్మాయి 

దీపావళి వెలుగులు 
కలకలలు కళకళలు
ద్విగుణీకృతం ఇంటాయన అట్టహాసంతో 
వీనుల విందు బలేపసందు
అద్భుత దృశ్యమాలిక ఇల్లాలికి   

alalu alaluga

అల కెరటమౌతోంది
అర్ధరాత్రి సమయంలో 

అలజడి కానా మరి నేను
మూడో కొమరితగా 
కలల అలజడి కన్నెవయసులో
బాధ్యతల అలజడి నడివయసులో
అశక్తత అభద్రత
అవేమరి అలజడివృద్దాప్యంలో 

అల కరిగిపోతుంది 
నిశ్శబ్దమై నిర్వాణమై నిశ్చలమై

అలగా అద్భుతం నీవు 
అలగా లయ నీవు   
లయింఛినంతవరకు అలవే నీవు 
అలజడివద్దు మనకు 
మిగిలిపోదాం అలలు అలలుగా కలలుకలలుగా 
5 .11 .11

Virinchi

విరించి రచించాడో
నూతన చరిత
నానమ్మలుగా అమ్మమ్మలుగా 
పదోన్నతి

అభినవ రాయలు
అడుగు పెట్టేడు తెలుగింట - రాజసంగా -
ఇద్దరు నాయనమ్మల పైత్యం
 ప్రకోపిస్తే మరింత 
ఎడపెడా రాసేస్తాడు
తెలుగు,కన్నడ,ఆంగ్లేయాలలో               
నాన్నతో - అమ్మతో
అందరితో డాన్స్ చేయించేస్తాడు
ఏడాది నిండకనే అన్నిరకాల వూపులు
నేర్చి మైఖేల్ జాక్సన్ - ప్రభుదేవా
మరెందరెందరినో తలపిస్తాడు
మరిపిస్తాడు మునుముందు -

దాడి చేయకండి  సుమీ
వాడి ముద్దొచ్చే బుగ్గలపై
ఆపిల్ పళ్ళే అవి మరి
ఆనందించండి 'ఫెదర్ టచ్' తో -

వారసుడు కాకరపర్తికి -
పౌరసత్వం అమెరికా -
దసరా సరదాలను
దీపావళి వెలుగులను
మోసుకొచ్చేడు
కానుకలుగ
మూడు  తరాలకి -
 
 హైద్రానిండా
ఎటు చూసిన ముత్తాతలు 
తాతలే
అచ్చ తెలుగులో నేర్చుకో
తాతా అని నోరార పిలువ

మళ్ళీ కలిసేసరికి 
ఎంత ఎదుగుతాడో మనవాడు
మా ముద్దుల మనవడు 
నానమ్మ శుభాకాంక్షలు నిరంతరం
చిరు ముద్దులు లేలేత బుగ్గలపై ప్రతిరోజూ

                    
                     
                       22nd oct; 2011

Maatrudevobhava


శుక్ల పక్షంలో పుట్టేవు
దిన దినం మరింతగా
అంచెలంచెలుగ ఎదిగావు -

నాగమ్మకి శక్తి మెండు
ప్రతాపం మెండు
పౌరుషం మెండు
కానీ సుధలు కురిపే సుధామయి
అమ్మమంచితనం కాదు కాదు ఘనం
అత్తమ్మగా నీ మంచితనం బహు బాగు బాగు
బలె హాయి హాయి

డాక్టరమ్మకి అమ్మమ్మవి
భద్రం సుమీ - పదిలం సుమీ
నీ ఆరోగ్యం

ప్యాలస్ లో మహరాణివి
పోలిస్ కే తల్లివి
సింధూరంలా పూసి - చిట్టీ చేయంతా
అందల చందమామ అతడే దిగివచ్చాడు
ఆది దంపతులు మీరు - సీతారాములు మీరు
పెద్ద చెవుల గణపయ్య నోరారా పిలుస్తాడు 'అమ్మా' అని
చిలిపి చిలిపి మురుగన్ - హడావుడి చేస్తాడు 'మమ్మీ మమ్మీ' అని

పుట్టిన రోజు వేడుక జరుపుకో సంబరంగా
ప్రతి గడియా - ప్రతి గంటా
బిడ్డలు తలుస్తారు - మనుమలు తలుస్తారు 
మునిమనుమలు సైతం - అమ్మమ్మమ్మ - పొలబారకు

ఆనందాల రైలుబండి స్వయంగా మోసుకొచ్చి
తెచ్చియిస్తారులే - మా నాన్నగారు 
నీకు కానుకగా -
జన్మదిన శుభాకాంక్షలు నీకు
మా అందరివీ

pachcha bottu

కాలం కడలిలో 
చిరు అలనై నేను 
కాలం రెక్కలపై
 భవితకు నా ప్రయాణం 

కాలాన్ని శ్వాశిస్తూ 
కాలంతో మమేకమౌతూ
కాలాన్ని శాసిస్తూ 
ఎగిసిన పెను  కెరటాలను
కాలం పుటలలో ధర్శిస్తూ  సమీక్షిస్తూ 

కాలం సాక్షిగా కడతేరేలోగా
కాలం రెక్కపై నాపేరు 
పచ్చ బొట్టుగా నిలిపే పనిలో 
నిమగ్నమైఉన్నా       

Saturday, 5 November 2011

swargam

ఆమనిలో తొలిమల్లెల సౌరభాన్ని
కానుకగా ఇచ్చేవు 
ఆ సౌరభాలు గుబాళించేవరకు 
అనుక్షణం నువ్వే నా మదిలో 

చెట్టాపట్టాలేసుకొని ఇరవయ్యయిదో 
మైలురాయికి చేరుకున్నాం 
నావయసు ఇరవయ్యయిదే 
బహుశా నీ వయసూ  అంతే 
అందుకే ఇద్దరం ఇంకా యవ్వనంలోనే 

నీ అడుగులో అడుగు వేసానేను 
ఆశ్చర్యం - నా అడుగులో అడుగువయ్యవునువ్వు  
కంటిపాపలా కాచుకున్నావు నన్ను 
నీ కంటిపాపలో దాచుకున్నావు నన్ను 

ఏమివ్వగలను నీకు 
గుండెనిండిన అనురాగం తప్ప 
పాణిగ్రహణం కొనసాగించు 
నా అంతిమ శ్వాస వరకు 
28 .2 .2010  

swargam

ఆమనిలో th