మా ఊరి వాతావరణం
బహు విచిత్రం
అరగంట వర్షం
అరగంట ఎండ
వర్షంలో తడిసేవారు
గాజు తలుపుల్లోంచి చూసి
ఆనందించేవారు
ఎండొస్తే పనులు
షాపింగులు
నీళ్ళలో పడవలేసే పిల్లలు
ఎండ కాచుకోవడం
ఎండలో నడక
వర్షానికి
ఎండకి
రెండింటికీ
గొడుగు తప్పదు
బయటకి వెళ్ళే
ప్రతీ ఒక్కరి
చేతిలో గొడుగు
హస్తభూషణం
31.10.25
No comments:
Post a Comment