Friday, 31 October 2025

ఊహల రెక్కలు

 

మనసు రెక్కల
వేగం
ఎక్కడికైనా మనని
తీసుకొని వెళ్తుంది

మనవాళ్ళు విదేశాల్లో ఉన్నా
మనసు ఎగిరెళ్ళి వాళ్లచుట్టే
గిరికీలు కొడుతుంది

పల్లెటూరి నుండి
ఉపాధి కోసం
మహానగరం వెళ్ళిన వ్యక్తికి
మనసు
కన్నవాళ్ళ దగ్గరే ఉంటుంది

ఒక క్రీడాకారిణి మనసు
అంతర్జాతీయ క్రీడలలో
పాల్గొని
బంగరు పతకం
సాధించాలనుకుంటే
మనసు అక్కడే ఉంటుంది

యువత మనసులు
స్వేచ్ఛ రెక్కలు
తొడిగి
ఊహాలోకాల్లో
విహరిస్తూనే ఉంటాయి

30.10.25

No comments:

Post a Comment