అంశం:చీకటి కిటికీ
తేది: 28.9.25
శీర్షిక: వెలుగు రేఖలు
ఈ గదిలో
నేను బందీని
గదిలో చీకటి
బయట చీకటి
కిటికీలో నుండి చూసినా
చీకటే
అయినా నాకు ఆశ
త్వరగా తెల్లవారుతుందని
ఈ చీకటి కిటికీ నుండి
అరుణోదయాన్ని చూస్తానని
ఈ చీకటి కిటికీ వెలుగులో
నన్ను చూసి
నా కష్టం తెలుసుకుని
నన్ను స్వేచ్ఛా ప్రపంచం లోకి
తీసుకెళ్తారని
చీకటి కిటికీలోకి కూడా
వెలుగురేఖలు వస్తాయి
వెలుగు నిండుతుంది
మన జీవితంలో
ఇది నా స్వీయ కవిత
డాక్టర్ గుమ్మా భవాని
No comments:
Post a Comment