అంశం: కత్తి కన్నా పదునైనవి జ్ఞాపకాలు
ప్రతి క్షణం గుండెను కోస్తూ
తేది:24.9.25
శీర్షిక: గుండెకోత జ్ఞాపకాలు
ఆలుమగలు
హాయిగా కాపురం కొనసాగిస్తుంటే
ఏ ఒక్కరు ఒంటరిగా మిగిలినా
కత్తి కన్నా పదునైనవి
గుండెను కోసే జ్ఞాపకాలు
గాఢంగా ప్రేమించిన అమ్మాయి
తండ్రి మాటకి తలవంచి దూరమైతే
గుండెను పిండే జ్ఞాపకాలు
మిగిలిపోతాయి ఎప్పటికీ
ప్రేమించిన ప్రియుడు
మోసం చేసి నమ్మకాన్ని వమ్ముచేస్తే
తీపి జ్ఞాపకాలు తేనె పూసిన
కత్తవుతాయి
తల్లితండ్రులను కోల్పోయి
అనాధలయిన పిల్లల కన్నీరు
జ్ఞాపకాల రక్త కన్నీరే
గత జ్ఞాపకాలు గుండెను
కోసేవి ఎన్నెన్నో
ఇది నా స్వీయ కవిత
డాక్టర్ గుమ్మా భవాని
Result declared
No comments:
Post a Comment