Saturday, 25 October 2025

నిశ్చయం

 భర్త మీద అలిగి

భార్య మొదటిసారి 

ఊళ్ళో ఉన్న 

పుట్టింటికి వెళ్ళిపోయింది 


ఆఫీసు నుండి 

వచ్చాక

అటూ ఇటూ 

తిరుగుతున్నాడు

కాలు కాలిన పిల్లిలా 


భార్య  తనకి

చెప్పనేలేదు

వెళ్తానని


ఎవరినైనా 

అడుగుదామంటే 

ఆత్మాభిమానం 


వంట చేసుకోవడం రాదు

బయటకి వెళ్లి 

తినాలనిపించలేదు 

ఏ తప్పులు చేసానా

అన్నదే ఆలోచన 

ఇంట్లో  లేని

భార్య  గురించి  దిగులు 

మరి కొద్ది  నెలల్లో

తండ్రిని కాబోతున్న 

సంతోషానికి 

ఈ పరిణామం 

ఓ గ్రహణం

పొద్దున్నే లేచి 

అత్తవారింటికి వెళ్ళి

బతిమాలో

బుజ్జగించో

తన భార్యని 

ఇంటికి  తెచ్చుకొని 

మహరాణిలా

చూసుకోవాలనే

నిశ్చయానికి 

వచ్చాడతను

17.10.25

No comments:

Post a Comment