కత్తి పైన నడక
ఆ అమ్మాయిది
ప్రేమించిన వ్యక్తి కోసం
ఇల్లు వదిలి వచ్చేసింది
పరువుకి ప్రాణమిచ్చే తండ్రి
ప్రేమిస్తున్నానంటూ
వెంటపడ్డ ప్రేమికుడు
మొహం చాటేసి
ధనికురాలైన
మరో అమ్మాయికి
తాళి కట్టేసాడు
ఇప్పుడు ఆమె
జీవితం
కత్తిమీద నడక
ఎక్కడో ఏదో ఉద్యోగం
వెతుక్కుని
స్థిరపడాలి తప్ప
తిరిగి ఇంటికి వెళ్ళే
సాహసం చేయలేదు
No comments:
Post a Comment