ఒకే గూటి పక్షులు
ఎక్కడ ఎగిరినా
చివరికి చేరుకుంటాయి
తమ గూటినే
ఒకే ఇంటి వ్యక్తులు
తమ ఇంటినే
చేరుకుంటారు
తమ వాళ్ళనే
కలుసుకుంటారు
విప్లవకారులు
ఒక గూటి పక్షులు
ఆధ్యాత్మిక వ్యక్తులు
ఒక గూటి పక్షులు
బడుగు జీవులు
ఒక గూటి పక్షులు
అనాధలు
అభాగ్యులు
ఒక గూటి పక్షులు
No comments:
Post a Comment