ధనమూలమిదం జగత్
డబ్బుకి లోకం దాసోహం
డబ్బుతో పదవులు
సన్మానాలు బిరుదులు
అన్నీ మనవే
డబ్బు కోసం హత్యలు
డబ్బు లేదని కలతలు
డబ్బు ఎవరి దగ్గర
ఎక్కువని
కొలతలు ఆరాలు
డబ్బే ముఖ్యమయి
బంధాలకే పగుళ్ళు
కన్నవారికే అవమానాలు
డబ్బుంటే రాచమర్యాదలు
డబ్బు కోసం కలలు
డబ్బు వెంట పరుగులు
విలాసవంత జీవితం
విదేశీ చదువుల
ఉద్యోగాల సంస్కృతి
క్రీడారంగంలో సైతం సిఫార్సులు
కోట్ల పెట్టుబడితో సినిమాలు
దివాలా తీసే నిర్మాతలు
అవినీతి కుంభకోణాలు
బవయ్యే సామాన్యుల జీవితాలు
డబ్బు కంటే
విలువలు
బంధాలు ప్రేమలు
ముఖ్యమని
అభిమానాలు ఆప్యాయతలు
తరగని సిరులని
భావి తరాలకు
ఉగ్గుపాలతో నేర్పిద్దాం
పాటించి చూపిద్దాం
No comments:
Post a Comment