Friday, 11 April 2025

మకర్ సవర. 1

 ఈ కథ మహాశ్వేతాదేవి గారి మకర్ సవర కధకి నేను చేసిన తెలుగు అనువాదం 


మకర్ సవర తన పదహారవ ఏట మంగళ్ సింగ్  అనే స్థానిక కుర్రాడితో‌ నేస్తం కట్టేడు. సవరజాతి‌ మగపిల్లలు ఎప్పుడూ  స్థానిక కుర్రాళ్ళతో నేస్తం కట్టి ఒకరినొకరు ఫూల్ (పువ్వు) 

అని పిలవాలని వాగ్దానం చేసుకుని జీవితమంతా  స్నేహితులు గానే ఉండిపోతారు. 


మకర్ వి విశాలమైన  భుజాలు,  సన్నటి నడుము, నవ్వుతూ ఉండే కళ్ళు, గోధుమరంగు జుత్తు, దృఢ కాయుడైన యువకుడు. ఎగురుతున్న అడవిబాతుని బాణంతో ఇట్టే పడగొడతాడు. వేట పండగ రోజున రాత్రంతా నృత్యం చేస్తాడు. కోపం వస్తే నిప్పులు చెరుగుతాడు.అతను భీభత్సాన్నీ సృష్టిస్తాడు.


మకర్ ఖేడియా సవరతెగకు  చెందిన వాడు.పురూలియాలొ జనం వారిని సవర ని పిలుస్తారు

బ్రిటిష్ వారు ఆ తెగని భారతదేశంలో నేరాలు చేసే తేగలలో ఒకటిగా  పరిగణిఃచేవారు


కోపమొచ్ఛినపుడు మకర్ మనిషి కాడు.శతృవులను బాణాలతో కొట్టడం, నిర్దాక్షిణ్యంగా బడితెతో బాదేయడం చేస్తాడు. అందువల్ల ఎప్పుడైనా ఏదైనా హింసాత్మక సంఘటన జరిగితే వాణ్ణి అరెస్ట్  చేయడానికి వీలుగా పోలీస్ ఆఫీసర్ స్టేషన్ రికార్డులో సబూయీజోర్ గ్రామవాసి బాబూసవర కొడుకు మకర్ పేరుని నేరప్రవృవృత్తి కలవానిగా నమోదు చేసేడు


(సశేషం) 


(మర్చి97 ప్రజాసాహితిలో మహాశ్వేతాదేవి  ప్రత్యేక సంచికలో ప్రచురించబడింది)

No comments:

Post a Comment