కిష్టోబాబు మృదువుగా అన్నాడు "మకర్ పద పోదాం...."
"ఆ...ఇది ఎమర్జెన్సీలో జరిగిందికదూ?" అని అడిగాడు డాక్టర్.
"కాకపోతే మరేమిటి? మకర్ పద.నీకు నేను ఏమైనా చేద్దామనుకున్నా. కాని ఏం చేయగలను?"
"అవును బాబూ, పదండి పోదాం. "
మకర్ తిన్నగా ఇంటికి వెళ్ళలేదు. సారా దుకాణం దగ్గర తాగుతూ కూర్చున్నాడు. అఖన్,మిగతా సవరలు ఒకరి మొహాలొకరు చూసుకొని తలలూపేరు.
"పద ,మకర్ నిన్ను మీ ఇంటికి తీసుకుపోతాను" అన్నాడు అఖన్ .
"అఖన్ ఇప్పుడే రాను."
వాడు అర్ధరాత్రి దాటేక సబూయీజోర్ గ్రామం చేరుకున్నాడు. వాకిట్లో రేవతి నాటిన చింతచెట్టు కింద చతికిలపడ్డాడు. తెల్లవారేక వెళ్లి కుమారిని పిలిచేడు.కుమారి మాట్లాడదామని నోరు తెరిచింది.కాని మకర్ అందుకున్నాడు మధ్యలోనే."వద్దు కుమారీ! ఇంకేం మాట్లాడకు.నాకు మొదటి పెళ్ళి కాకముందుఒక డాక్టరు నేను తండ్రినయ్యే అవకాశం లేకుండా చేసేడు. కాని నాకది తెలియనే తెలియదు. కాదు కూడదంటే గోర్నమెంటు నన్ను మళ్ళీ జైలుకి పంపిచేస్తుందని వాళ్ళు నన్ను భయపెట్టేరు. వాళ్ళు ఒక్క సూదిమందే వేస్తాం అని చెప్పేరు.....కానీ వాళ్ళేం చేస్తున్నారో నాకు తెలియదు.....ఏం చేసిందీ నాకు ఎప్పుడూ చెప్పలేదు. కొంత డబ్బు మాత్రం ముట్టచెప్పేరు......నన్ను వదిలేసి వెళ్ళిపో,కుమారీ,మీ అయ్య దగ్గరకి వెళ్ళిపో.....నీ బట్టలు,గాజులు తీసుకు పో...నువ్వు మళ్ళీ మను వాడు.....అమ్మవి అవుతావు....వెళ్ళు"అన్నాడు మకర్. కుమారి వెళ్ళిపోయి ,రెండు రోజులు కావస్తోంది.
మంగళ్ కూడా కొద్ది గంటల క్రితం తనని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు.
మకర్ చీకట్లో కూచొని తన బతుకును గురించి తలపోసుకుంటున్నాడు..సవర బతుకులన్నీబలమున్న బాబూల చేత ,పోలీసుల చేత,పంచాయితీ పెద్దల చేత నియంత్రించబడ్తాయి. అయినా ప్రతీ సవరకి తన భార్య, తన ఇల్లు, తన పిల్లలు ఉంటారు. కానీ ఏమీ లేనిది తనకే.
మర్నాడు కూడా మకర్ గుమ్మంలో మూగివాడిలా,హతాశుడై కూచొనే ఉన్నాడు. తనేం చేయాలి?సబూయీజోర్ గ్రామాన్ని విడిచి వెళ్ళిపోవాలా? కానీ తనకి తెలిసిన ప్రపంచం సబూయీజోర్ పోలీస్ స్టేషన్, జైలు ఇవే.
తను ఎక్కడికి వెళ్ళగలడు? ఏం చేస్తాడు? ఆ పెద్ద,విశాల ప్రపంచం గురించి తనకేం తెలుసు?
ఆవేళ మధ్యాహ్నం వాడు గొడ్డలిని తీ
సుకొని, సబూయీజోర్ విడిచి పెట్టేసాడు.అడవికి వెళ్ళడానికిది సమయం కాదు. ఒక గమ్యం లేకుండా నడుస్తూ వాడు ఎప్పుడో చచ్చిన ఒక బీవులా చెట్టు దగ్గర ఆగేడు. ఆది
ఎవరిదీ కాదు. దాన్ని ముక్కలుగా నరకకుండా అలా వదిలేసారు.తాను దాన్ని ముక్కలు చేసి, ఆ కట్టెలని నయాగడ్ బజారులో టీ దుకాణం యజమాని శ్రీమంతో దగ్గిరకి తీసుకెళ్తాడు.ఆయన తప్పకుండా నాలుగైదు రూపాయల దాకా ఇస్తాడు.
ఓ కిలో నాసిరకం బియ్యానికి అది సరిపోతుంది. ఇలా ఆలోచించి,వాడు గొడ్డలి ఎత్తి ఒక్కవేటు వేసేడు.
ఆ గోధుమ రంగు జుత్తు, గోచిపాతతో వాడు జానపద కథల్లో నాయకుడైన అజాన్ సవరలా ఉన్నాడు. అజాన్ సవర
ఒక బీవులా చెట్టు దుంగను నరకడానికి వెళ్ళి, ఒక బిందెలో బంగారాన్ని చూసేడు. కానీ అతను ఆ బంగారాన్ని ముట్టుకోకుండా కట్టెలు మాత్రం తీసుకొని వెళ్ళిపోయేడు.
No comments:
Post a Comment