ఫూల్ సంబరం జరిగి చాలా కాలమైనా,ఇంటి గుమ్మంలో ఒంటరిగా కూర్చున్న మకర్ కి అదే ఇప్పటికీ బాగా గుర్తుకి వస్తోంది. సాయంత్రం వేళ మంచుతో నిండిన చలిగాలి వీస్తోంది.
కోతకి వచ్చిన వరి కంకుల పరిమళాలు మత్తెక్కిస్తున్నాయి. తన దగ్గిర డబ్బులుంటే తాగడానికి వెళ్తాడు కానీ
పనికిపోలేదు.అందువల్ల వాడు పర్స్ గా వాడుతున్న పోలథిన్ సంచి ఖాళీగానే ఉంది.
మంగళ్ తన సైకిల్ మీద వచ్చి ఆగి"ఫూల్!మకర్ ఫూల్ "అని పిల్చాడు.
" ఇక్కడే ఉన్నా"
"పనికి వెళ్ళలేదా"
"లేదు.వెళ్ళలేదు. "
"ఇలా కూర్చొని విచారిస్తే లాభం లేదు"
"నేను విచారించడం లేదు."
"ఏదైనా తిన్నా వా?"
"లేదు,తినలేదు."
"నీ కోసం కొన్ని మురీలు కొననా"
"వద్దు ఫూల్. నువ్వు ఇంటికి వెళ్ళు."
"ఇలా జరగడం మొదటి సారి కాదు.మూడు సార్లు......"
మకర్ చిన్నగా నవ్వేడు.ఆవును మూడు పెళ్ళిళ్ళు.
"నువ్వు మరో పెళ్లి చేసుకోవా?"
"చేసుకోను"
"సరే,నేను రేపు వస్తాను. మా అబ్బాయికి జ్వరం. ....వాడి కోసం మందు తీసుకెళ్తున్నాను."
"ఇంటికి వెళ్ళు ఫూల్ "
"కాని నవ్వు పని చేయకపోతే....."
"ఒక్కరోజు తినకపోతే సవరోడు ఛస్తాడా ఏం? నువ్వు ఇంటికి వెళ్ళు"
No comments:
Post a Comment