రేవతి వదిలి వెళ్ళి పోయినపపుడు తెగ ఏడ్చింది.మకర్ కాండోర్ గ్రామానికి వెళ్ళినప్పుడల్లా ఆమెని చూసి వచ్చేవాడు. రేవతి ఇప్పుడు భూటా సవర భార్య.ముగ్గురు కొడుకుల తల్లి. ఆమె మకర్ పట్ల ఎప్పుడూ దయగా ఉండేది. "కొంత విశ్రాంతితీసుకో.మురీలు, ఉల్లిపాయలు తీసుకొంటుండు " అని కొంతసేపాగి అప్పుడామె ప్రశ్నిస్తుంది."ఏంటి ఈ చెట్టు కూడా కాయదా? "మళ్ళీ మాట కలుపుతుంది " కాని చూడ్డానికి బాగుంటుంది సుమీ"అని.
రెండో పెళ్ళి కూడా మంగళ్ ఏర్పాటు చేసినదే.అతను కిష్టోబాబు తో అన్నాడు. "నేను మకర్ కోసం మరో సంబంధం చూడనా?"
"తప్పకుండా చూడు. నేను వాడి మొహం చూడలేకపోతున్నా."
మంగళ్ అన్నాడు "నేను గెండా సవర తో మాట్లాడేను.అతని కూతురు భూతి వాడికి తగిన జోడీ.
" గెండా ఒప్పుకుంటాడా?"
"ఎందుకు ఒప్పుకోడు?"
"ఈ భార్య నన్ను వదిలేసిందిగా....."
"అయితే ఏం నువ్వు సన్యాసివి అవుతావా....సాములోరులాగ"
"నువ్వేం చేస్తావో,చేయి ఫూల్! ఆడది లేని గుడిసె బిక్కుబిక్కు మంటుంది."
"ఐదేళ్ళ దాకా పిల్లలు కలగలేదని చెప్పి ఆమె నన్ను వదిలి వెళ్ళిపోయింది. మరి కొన్నాళ్ళ పాటు ఆగలేకపోయింది.మా పెద్దన్నయ్యకి తన మొదటి సంతానం పెళ్ళయిన చాలా ఏళ్ళకిగానీ కలగలేదు.
మకర్ ధైర్యం చిక్కబట్టుకున్నాడు.జీవితానికి ఒక సవర ఇచ్చే అర్థం అంతకన్న మరేమిటి? సవరి సవరని ఒక లేత ఖర్జూర తీగలా అల్లుకుంటుంది.అప్పుడు ఒక అందమైన ' ఇప్ప'చెట్టులా తన కడుపున కాయలు కాస్తుంది. ఆడుతూ,కేరింతలు కొడ్తూ, అడపాదడపా ఏడ్చే, పసికందులు నడయాడే సవర ఇళ్ళు ఆనందనిలయం. పసివాని మెత్తపు చర్మపు వాసనే అతి తియ్యటి వాసన.
ఈసారి కొద్దిగా ఆటా పాటా.మకర్ పెళ్ళి కూతురుకి ఓలి చెల్లించేడు. కిష్టోబాబు తెగ లో వారి విందు కోసం బియ్యం, మేక ఇచ్చేడు. సబూయీజోర్ సవరలు సారా సమకూర్చారు
భూతి తండ్రికి కిష్టోబాబు బెంగాలీ బోధించే బడిలోనే తోటమాలిగా పని. భూతి ఒక పెద్ద గ్రామంలో ఉండటమే కాకుండా గిరిజనేతరుల ఇళ్ళు కూడా చూసింది. ఆమె రేవతిలా అందమైనది కాకపోయినా చురుకైనది. కష్టపడి పని చేస్తుంది. పొదుపరి కూడా. ఆమె" మనం మరో గుడిసె కట్టుకోవాలి. మేకల్ని, కోడిపిల్లల్ని అందులో వుంచడానికి. పనులు లేని రోజులలో చేతిలో అడవిగడ్డితో తాళ్ళు పేనొచ్చు.మనం కష్టపడి పనిచేసి,డబ్బును సరిగ్గా వాడితే ఒక సవర గుడిసె కూడా ప్రత్యేకంగా కనిపిస్తుంది.
.
No comments:
Post a Comment