ఆ రోజుల్లోనే మంగళ్ మకర్ కీ,రేవతికీ పెళ్ళి కుదిర్చేడు ."రేవతా?ఆ పహాడీసవర కూతూరా?ఆమె నాకు బాగా తెలుసు. మకర్ కి తగిన ఈడూజోడూ"అన్నాడు.
మొదటి పెళ్ళికి అన్ని సాంప్రదాయాలు పాటించారు.ఒక మంచిరోజు చూసి మకర్ కి ముందు ఒక మామిడిచెట్టు తోనూ,రేవతికి ఒక ఇప్పచెట్టుతోనూ పెళ్ళి జరిగింది.
"వైవాహిక జీవితం ఆ చెట్టు పచ్చగా ఉన్నంతవరకు కొ నసాగాలి.👌ఆ చెట్లు పూవుల్నీ,పళ్ళనీ కాసినట్టే మీ ఇద్దరూ పిల్లల్ని కనండి. పిల్లలే జీవితానికి ఆనందాన్నీ, సంతృప్తినీ కలిగిస్తాయి."
ఆచెట్లతో పెళ్ళి తంతు తరవాత అసలు పెళ్ళి.అన్నం,మాంసం,కావలసినంత సారా.పాటలు, నృత్యాలు. రేవతి పుష్పించిన ఇప్పచెట్టంత అందంగా
ఉంది.
మకర్ చాలా సంతోషంగా ఉన్నాడు.
ఇద్దరూ పొద్దున్నే అడవికి బయలుదేరేరు.గోతులు తవ్వి, మొక్కలు నాటార అవి ఇప్పుడు పెరిగి పెద్ద చెట్లయ్యాయి. కాని రేవతి ఐదేళ్ళ తరవాత కూడా తల్లి కాలేదు.ఆమెలో ఓర్పు నశించింది.
"పిల్లలు లేని పెళ్ళి ఏం పెళ్ళి ? నీతో ఇహ నేను ఉండను.కాపు నివ్వని చెట్టునూ, గొడ్రాలైన ఆడదాన్నీ ఎవరూ ఉంచుకోకూడదు. నువ్వు మళ్ళీ పెళ్ళి చేసుకో "అని సలహా యిచ్చింది.
" ఆమె వస్తే రానీ.కానీ నువ్వు కూడా ఉండు"అన్నాడు మకర్.
"ఉండను. నేను అఆలోచనేభరించలేను. నేను ఆ ఆలోచనేభరించలేను.మీ ఇద్దరికీ పిల్లలు పడితే అసూయ పడకుండా ఉండలేను."
No comments:
Post a Comment