Sunday, 27 April 2025

మకర్ సవర 3

 

"ఏం,నాపేరు రిజిస్టర్ లోకి ఎక్కక పోతే నేను అసలైన సవరనికానా"

బాబూ సవర నిట్టూర్చి అన్నాడు. "పోలీసులు  మనని బతకనీయరు.కొంతమంది సవరలనయినా కటకటాల  వెనక్కి  నెట్టనిదే వారికి నిద్ర పట్టదు.అందుకే కిష్టోబాబు అంటాడు. " బాబూ నేను సవరలకి న్యాయం జరిగేలా,వాళ్ళు తలెత్తుకొని తిరిగేలా, పశువుల్లా వేటాడబడకుండా   ‌మనుషుల్లా బతికేలా  చూస్తాను "అని.

కాని పదహారేళ్ళ మకర్  మున్ముందు తనది ఓ శాపగ్రస్తమైన  జీవితం అవుతుందని ఊహించలేదు. అందువల్ల వాడు మంగళ్ తో చాలా సంతోషంగా నేస్తం కట్టేసాడు.సవరలు ప్రేమ  కోసం,ఆత్మీయత కోసం పరితపిస్తారు.సవర యువకులు ఈ 'నేస్తం పండగం'టే చాలా  మక్కువ చూపుతారు.

ఆరోజు   సవర,స్థానిక  యువకులు ఒకచోట కూడారు. వాళ్ళు  మదోలు వాయిస్తూ  ఆడుతూ పాడుతూ  సంబరం జరుపుకున్నారు.

" నేను ఝుమురు పాటలు పాడుతా.
ఒకటి,రెండు,మూడు సార్లు
మదోల్ వాయించేఅబ్బాయే
అవుతాడు నా ఫూల్"
అని మకర్  పాడేడు.


No comments:

Post a Comment