Thursday, 3 April 2025

పరమానందం

 శీర్షిక: పరమానందం


చిన్ని చిన్ని  ఆనందాలు

పగటి కలలు


సుందర స్వప్నాలు

సుమధుర  రాగాలు


అద్భుత జలపాతాలు

అందచందాల లోయలు


శుభోదయం పలికే

అరుణోదయాలు


సెలవిక సఖీ

సంధ్యా సమయాలు


మెరిసే తారల

అమావాస్య రాత్రులు


నిండు చందమామవే

నమ్మబలికే

గడుసు సుధాకరుడు 


 ప్రతి చిన్ని ఆనందం

పరమానందం

బ్రహ్మానందం




డాక్టర్ గుమ్మా భవాని

No comments:

Post a Comment