అటువంటి రికార్డులుపురలియా పోలీసులకు ఎల్లవేళలా సహాయకారిగా ఉండేవి.వాటి ఆధారంగా సవరలని ఏ సమయంలోనైనా అరెస్ట్ చేయొచ్చు.పోలీసు చట్టంలో ఏదో ఒక సెక్షన్ కింద వాళ్ళపై క్రిమినల్ కేసుని బనాయించి జైలు శిక్ష విధించొచ్చు.
సవరలంటే పురలియాలోని గిరిజనేతర బాబూలకు భయం. పోలీసు రికార్డులో
ఒక్కసారి 'నేరప్రవృత్తి కలవాడు'గా నమోదయిన సవరని అరెస్ట్ చేసి జైలుకి పంపేయొచ్చు కదా అని వాళ్ళ ఆలోచన.
"బిడ్డా!నీపేరు రికార్డులోకి ఎక్కిందిరా. నువ్విప్ఫుడు అసలైన సవరవయ్యావు" అన్నాడు మకర్ తండ్రి బాబూ సవర.
No comments:
Post a Comment