బందీ గ్రామం బాబూలకు మకర్ అనే పేరున్న సబూయీజోర్ సవర,అదీ ఒంటరిగా వస్తున్నాడు. ఎంత అదృష్టం! గోకుల్ బాబు, మరి కొంతమంది కలిసి సవరలని గూడెంనుంచి వెళ్ళగొట్టించడానికి ప్రయత్నించి, ఆపని చేయలేకపోయారు. సవరలు గుంపుగా ఉన్నప్పుడు వాళ్లు ఒక్క సవర ఒంటిమీద చేయివేసే సాహసం కూడా చేయలేకపోయారు. ఒంటరిగా చేజిక్కిన మకర్ ని బాది బాది
వాళ్ళు పోలీసు స్టేషన్ కి ఈడ్చుకుని వచ్చేరు.గోకుల్ బాబు అధికారంలో ఉన్న.ప్రభుత్వానికి మద్దత్తునిచ్చేవాడు కాడు కానీ ఆసబ్ ఇనస్పెక్టర్ తను ఓ సవరని బాది అతనికి అప్పచెప్పినందుకు చాలా సంతోషిస్తాడనుకున్నాడు.
సబ్ ఇన్ స్పెక్టర్ ఆ ప్రాంతానికి కొత్తవాడు. అతను వారం క్రితం కలకత్తాలోని పై అధికారుల నుండి గట్టిగా హెచ్చరిక చేసే ఓ శ్రీముఖాన్ని అందుకున్నాడు. సవరలు గానీ, మరే ఇతరులుగానీ అత్యాచారాలకీ, హింసకీ గురికాకుండా చూడాలని, అలా ఒకవేళ ఏమైనా జరిగితే ఆ నేరం చేసిన వారిని గట్టశిక్షించాలనీ.పోలీసు ఇన్ స్పెక్టర్ ఆ సాయంత్రం వీడియో పేలస్ కి వెళ్ళి 'రామ్ లఖన్'సినిమాలో అనిల్ కపూర్ ని చూద్దాం అనుకున్నాడు కాని ఇంతలో పులిమీద పుట్రలా ఐదుగురు
వ్యక్తులు ఒక సవరని ఈడ్చుకుంటూ రావడం చూసి అతను చాలా చి
రాకు పడ్డాడు.
"ఏమయింది? వాడు ఏం చేసేడు?చికకుల్ బాబు చీదరిస్తూ అన్నాడు, "ఈ సవరలు అడవిని బతకనీయరు. ముందు వీడిని అరెస్ట్ చేయండి. లేకపోతే మేమే వీడి పని పడతాం. వీడు ఓ చెట్టు నరుకుతున్నాడు.కట్టెల ఖరీదు కనీసం పది రూపాయలుంటుంది .పది రూపాయలు కట్టమని దండుగ వేసి గొడ్డలి లాక్కోండి.
మకర్ పగిలన పెదాల నుండి కారుతున్న రక్తం తుడుచుకొని చెప్పాడు." అది చాలా పాత బేవులా చెట్టు మొద్దు బాబూ.....రోడ్డుకి అడ్డంగా పడిఉంది.మీరే వచ్చి చూడండి.ఆరోజు మీరు సైకిలు మీద వెళ్తుంటే అది తగిలి మీరు సైకిలు మీంచి పడీపోయారే....అదే బాబూ!వచ్చి చూడండి "అన్నాడు.
" ఓహో! ఆ మొద్దా?"
"అవును బాౠ, మూడ్రోజులై నేనేం తినలేదు.అందుకని అది నరుకుదా మనుకున్నా.అది పూర్తిగా నరికీ ముక్కలుగా కొడ్తే శ్రీమంతో తప్పకుండా నాలుగైదు రూపాయలు ఇస్తాడు. ఈ బాందీ గ్రామానికి దగ్గరగా ఏ అడవీ లేదు బాబూ "
"నీ పేరు? "
"మకర్ సవర బాబూ! "
"నెత్తురు తుడుచుకొని, బయటకెళ్ళి కూర్చో."
మకర్ గదిలోంచి బయటకెళ్ళేడు.సబ్ ఇన్ స్పెక్టర్ గోకుల్ బాబు వైపు ఉరిమి చూసేడు. అ సర్క్యులర్ వల్ల ఇలాటి పెద్ద మనుషులమీద విరుచుకు పడటానికి
తనకి మంచి అవకాశం చిక్కిం దనుకున్నాడు ఇన్ స్పెక్టర్ .
No comments:
Post a Comment