"వేసెక్టమీనా?మకర్ కా?కానీ ఎలా?1975లోనో,1976 లోనో నయాగడ్ హెల్త్ క్యాంప్ లో ఓ సామూహిక వేసెక్టమీ ప్రోగ్రాం జరిగిన మాట వాస్తవమే. మఖన్ అనే ఓ దళారి పల్లెలకి వెళ్లి గిరిజన యువకులను ప్రలోభపెట్టేవాడు. కాని నాకు ఈ విషయం తెలిసేక వెంటనే ఓ పెద్ద ప్రదర్శన నడిపేను." గిరిజన జనాభాని తగ్గించడానికి ఇదో కుట్ర తో కూడిన పథకం.సవరలు ఇప్పటికే ఒక అల్ప సంఖ్యాక గిరిజన తెగ" అని నినదించేము.వాళ్ళు ఆ కేంప్ ని ఎత్తి వేసి అక్కడి నుండి పారిపోయారు.మేము మఖన్ ని బాగా ఉతికి ఆరేశాం.మకర్!
తెచ్చుకో-ఆ రోజుల్లో నీకు ఏదైనా ఆపరేషన్ జరిగిందా?నువ్వు అప్పుడే మొదటిసారి జైలు నుండి బయటపడ్డావు."
"నాకేం జరిగింది బాబూ? ...ఆపరేషనా? నాకేం తెలియదే."
"ఆ హెల్త్ క్యాంప్. ...నయాగడ్. ...మఖన్ తో అక్కడికి వెళ్లేవా? ఒరేయ్ దద్దమ్మా, నువ్వు మఖన్ నుండి డబ్బు తీసుకున్నావా? డాక్టర్ దగ్గిరకెళ్ళేవా?"
మకర్ మొహం ఓసారి వెలిగి,చిరునవ్వు నవ్వేడు. ఆతృతగా చెప్పసాగాడు. "అవును బాబూ! నాకు గుర్తొచ్చింది. అలాటి రోజు నేను మరిచిపోగలనా?ఆహా! మఖన్ బాబు ఆరోజు ఇంటిదగ్గర నాకేం తిండి పెట్టాడనీ? మాంసం,అన్నం ,దుంపలకూర.....నా మొదటి పెళ్ళికి ముందు మాట....నా కేం నొప్పి తెలియలేదు బాబూ. ....వందరూపాయలు కూడా దొరికాయి. "
కిష్టోబాబు నిర్ఘాంతపోయి వాడివైపే
చూస్తున్నాడు. మకర్ అమాయకత్వం చూసి అతనికి మతి పోయినట్టుంది.
"ఆ డాక్టర్ ఒక సూది గుచ్చేడు....అంతే....ఒకటి,రెండు రోజులు నొప్పి ఉండొచ్చని చెప్పేడు. .....మఖన్ బాబు ,మకర్ నువ్వీ సూదిమందు తీసుకోవాలిగా.తీసుకుంటే డబ్బులిస్తా'రని చెప్పేడు.
" ఓరి దౌర్భాగ్యుడా!ఇంకా నీలాంటి వాళ్ళు ఎంతమంది?"
"అందరు కుర్రాళ్ళూ పారిపోయారు. నేను పారిపోలేకపోయా."
"నేను గుంపుని తీసుకువెళ్ళి వాళ్ళని తరిమేసాగా! ? గుర్తుందా?"
" దానికి ముందు........"
"మరి నాకెందుకు చెప్పలేదు? "
"మఖన్ బాబు మీతో చెప్పొద్దని చెప్పేడు. ఆయనకి పోలీసులు బాగా తెలుసు. అందువల్ల నాకాయన అంటే భయం. "
"మకర్, నా తండ్రీ! ఆ సూదిమందు, ఆపరేషన్ నిన్ను వంధ్యు డిగా......తండ్రివి కాలేకుండా చేసేసాయిరా.అప్పటికి నీకింకా ఇరవై ఏళ్ళే.అందువల్లే నువ్వు తండ్రివి కాలేకపోయావురా.ఎలాటి వెన్నుపోటు పొడిచేరురా నిన్ను! "
"డాక్టర్ బాబు నన్ను బాగు చేయలేడా
?_"
డాక్టర్ స్పష్టంగా చెప్పాడు"లేదు మకర్ ఇది జబ్బు కాదు.ఇది మగాళ్ళకి తండ్రులు కాకుండా ఉండేందుకు చేస్తారు.ఏం? ఆపరేషన్ చేసేముందు వాళ్ళు నీకివేవీ చెప్పలేదా?"
"లేదు,వాళ్ళు నాకేం చెప్పలేదు బాబూ అప్పుడే నేను జైలు నుండి బయటకొచ్చాను.మఖన్ బాబు ఆ గోర్నమెంటు.....సర్కారోళ్ళు జైలు నుండి బయటకొచ్చిన వాళ్ళందరికీ సూదిమందివ్వాలని చెప్పేడు. వాళ్ళు
చెప్పినట్టు చేయకపోతే గోర్నమెంటు మమ్మల్ని మళ్ళీ జైలుకి పంపించేస్తుందన్నాడు.నేనిక బందిఖానాలో ఉండాలనుకోలేదు.రేవతిని పెళ్ళిచేసుకో
బోతున్నా కూడా. ...ఇల్లు. ...ఏది జరగాల్సుందో దాన్ని జరగకుండా ఆపలేం కదా!......మఖన్ ని ఇప్పుడు చంపేద్దును.కాని వాడు కిందటేడు చచ్చేడు.
.
No comments:
Post a Comment